ఆశా దీపం

ఆశా దీపం

రచన: దాకరపు బాబూరావు

ఏ రోజుకారోజు
కాలపు చెట్టు లేలేత చివుళ్ళ తో ప్రతి ఉదయాన్ని
పొద్దు పువ్వుని చేసి నా ఆశల ముంగిట్లో కొత్త సంతకం చేయిస్తూనే ఉంటుంది….

మూసుకున్న ఆ హృదయతలుపులు ఎప్పటికైనా
తెరుచుకోక పోతాయా అని
తలపుల తోరణాలు కట్టుకుంటూ బేల హృదయంఎదురుచూపుల
గుమ్మమై నిరీక్షిస్తూనే ఉంటుంది…..

ఉదయపు తలుపుల్ని తోసుకొచ్చే
తొలిపొద్దు కిరణంలా
నువ్వొస్తావని
నీ నుండి నాలుగు మాటల పూలురాలితే
ఏరుకుందామని హృదయం తోటమాలిలా కాపలా కాస్తూనే వుంటుంది ఆశగా…….

ఎంతకూ
తీయని ఆ తలుపుల వద్దేఆలోచన్ల పిట్టలు ఎగురుతుంటాయే గానీ నువ్వులేనిమాటల గూటికి వచ్చి చేరవు….

నువ్ మూసేసిన పొలిమేరలప్రవేశ ద్వారాల వద్ద నేను నీ చిరునామా వెతుక్కుంటూ తిరుగుతూనే వుంటాను….

ఏ మాటల ఈటెలతో నిన్ను గాయపర్చానో
మనః సమీక్షకు నన్ను నేను పురిగొల్పుకుంటూ ఉంటాను….

నీ ఎడబాటు రాగంఎలిజీలు ఎలిజీలుగా కురుస్తున్నా….

ఎప్పటికైనా నువ్వు తలుపు తీయకపోతావా అన్న
ఆశా దీపాన్ని ప్రతి రేయీజ్ఞాపకాలదీవిలో వెలిగించుకుంటుండగానే పొద్దు మలిగిపోతుంటుంది……

***

You May Also Like

3 thoughts on “ఆశా దీపం

  1. ఆశా దీపం, కవిత నా హృదయాన్ని తట్టి లేపింది.
    మనిషి హృదయంలో కలిగే ఆలోచనలు చక్కని
    వరవడి లో కలాన్ని కదిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!