ప్రేమ ఒక నటన

ప్రేమ ఒక నటన

రచన : యాంబాకం

రావు గారు చాలపెద్ద మనిషి అతని గురించి చేప్పలంటే ఒక్క మాటలో పాత కాలంలో సినిమా లాగ సాగుతూ పోతుంది. రావు గారు చదవులో వీక్ పనిలో షార్ప్ అదే అతని పల్లస్ ఫాయింట్. అతను చిన్నపటి నుండి కష్టపడుతూనే ఉన్నాడు. కొన్ని జీవితాలు అంతే మరి,

ఇంక విషయానికి వస్తే అతని పూర్తి పేరు గోపాల్ రావు అతని భార్య పేరు కనక దుర్గమ్మ కాని ఇద్దరి కి ముద్దు పేర్లు రావు, కనకం. వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె వారి పేర్లు శతీష్ శిరీష ఇద్దరు చదువు కొన్నారు. కుమార్తె కు పెళ్లి చేయగా శిరీష అత్త గారింటికి వెళ్ళి పోగా కొడుకు వారు తోనే ఉండసాగాడు.
ఇక కొడుకు కాస్త అమాయకుడు ఎవరితో కలవడు కానీ మాట్లాడటం తక్కవే అని చెప్పాలి ఇంకా పాతిక సంవత్సరాలు వచ్చినా ప్రతి విషయం అమ్మ నాన లపై ఆదారపడుతాడు”.రావు గారు వాకింగ్ పోయినప్పుడల్ల నేను చిన్నప్పుడు ఇలాగే ఉన్నాను శతీష్ ని నాలా కాకుండా మార్చాలి”! వాడు పెద్దవాడై అయిపోయాడు. అని మనసులో అనుకుంటూ ఉండేవాడు “శతీష్ రూము లో ఎదో కంప్యూటర్ లో బిజీగా ఉన్నాడు. అప్పుడు రావు వెళ్ళి శతీష్ తో ఇలా”! మాట్లాడటం మొదలు పెట్టాడు.
చూడు నాన శతీష్ నేను ఒకప్పుడు నీలాగే ఎవరి తో సంబంధాలు అక్కరలేదు అని చాల కోల్పోయిన అది నీకు జరగటానికి లేదు ఈ ప్రపంచంలో చాలా మంది చాలా రకాలుగా మనకు పరిచయం అవుతారు. కానీ మనం “ఇలాగ కూడా ప్రేమిస్తారా”! అనుకొనేలా ప్రేమించాలి నలుగురినీ ఆకట్టు కోవడం అవసరం ఆలా చేస్తేనే చట్టూ జనం ఇట్టే మనతో కలసిపోతారు. మొదట వేష భాషలతో వారి మనసు ను ప్రేమించేలా చేసుకోవాలని తిరిగి మనవంతు ప్రేమించాలి. ఇతరుల దృష్టి ని ఆకర్షించాలంటే చక్కని మాటతీరు పదాలు సాగదీస్తూ నిరసనగా మాట్లాడే వారు ఆకట్టు కోలేరు, వారి పై ప్రేమను కురిపించాలి.మనం చెప్పేది ఎదుటి వారికి చక్కగా అర్థంఅయియేటట్టుగా!వివరించ గలగడం ఓ కళ! ఈ కళ అందరికీ అబ్బితే… ప్రేమను ఇచ్చిన వార మౌతాము.మాటల్లో మర్యాద, ఎదుటివ్యక్తి కి అర్థం ఆయ్యలా, ఎదుటివ్యక్తిని బట్టి మాట్లడే తీరు ప్రశంలతో ప్రసన్నం చేసుకోవడం. ఎదుటి వాడిని మాట్లాడే అవకాశం ఇవ్వడం ఇలా ఇంక బంధువులను ప్రేమించే తీరు ప్రేమతో వ్యవహరించాలి మన ప్రవర్తన తీరులో ప్రేమతత్వం ఎంతో ప్రాధాన్యత సంతరించు కొంటుంది.ముఖ్యంగా చుట్టు పక్కల వారితో వ్యవహరించే విధానం “నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది”అన్న సామేతలాగా వారి ప్రేమను మనం తప్పక పోందాలి శతీష్ నాన ఎలా అంటే మన సమాజంలో జీవిస్తున్నాం కనుక మనం జెంటిల్ మన్ గా, జంటిల్ ఉమెన్ గా మారటం అభినందించగల మనస్సు ఉండాలి.ఇలాగే ఎదురు పడేవారు ఉంటారు వారిపై ఆసక్తి చూపిలి పరిచయం చేసుకొని వారి పై ఆసక్తి ఉంచాలి మళ్ళీ మళ్ళీ కలిసేందుకు చోరవ చూపాలి ఎప్పడైన ఆవ్యక్తి కలిసినప్పుడు గుర్తించాలి. చిరునవ్వుతో పేరు పెట్టి పలకరించాలి అప్పుడు ఎదుటి వ్యక్తి అభిమానం పెంచుకుంటాడు. అప్పుడు మనపట్ల ఆసక్తి పెరుగుతుంది. అలా అవసరమైనప్పడు చేతనైన సాయపడటం. ఈ భూమి మీద మనం నివసిస్తున్నందుకు మనం చెల్లించాల్సన అద్దె ఏమిటో తెలుసా? ఇతరులను ప్రేమించడం సహాయం చేయటం “పరోపకారార్థ మీదట శరీరం “అన్నాడు ఒక మేధావి.అంటే ఇతరులను ప్రేమించడం ఉపమోగపడటం వల్ల మనపట్ల గౌరవంగా తిరిగి కూడ ప్రేమిస్తారు. పెద్దవారి పట్ల గౌరవంగా మెలగటం .చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువు కనపడిప్పుడు, నాన తోకలసి తిరిగిన పెద్దలను కలిసి నప్పుడు వారికి చక్కని గౌరవం ఇచ్చి ఇంకా ఇంటికి తీసుకెళ్ళి మర్యదలు చేసి పంపగలిగితే పది మందికీ గొప్పగా చేప్పుతారు.ఎవరూలేని వారి పట్ల సేవాభావం “దయగల హృదయమే దేవాలయం” ఆన్న సామెత లాగా లేని పెదలకు అన్నంపెట్టటం బట్టలు. వివ్వడం అనారోగ్యం పాలైన వృద్ధులను వికలాంగలను ఇలా వారి ని ప్రేమాగా చూడటం . చిన్న చిన్న సెలబ్రేషన్లు పార్టీలు అతిథుల ఎంపికలోను ఆహ్వనించడం అందరికీ నచ్చే భోజనం ఏర్పాటుచేయడం. బహుమతులు తీసుకోవడంతో పాటు మనమూ ఇవ్వడం గుడ్ బైలు థ్యాంక్యూలు,. చెప్పుకోడం. కోంచెం టచ్ లో ఉండేందుకు ఫోన్ కాల్స్ చక్కగా ఫోన్ లో సుదీర్ఘ సంభాషణ మనకు కావలసిన వారు తెలిసిన వారు ఉద్యోగ రీత్యా టచ్ లో ఉండాలంటే అప్పడప్పుడు ఫోన్ చేయడం ఇలాకూడా ప్రేమే. మన కళ్ళు పచ్చగా ఉంటే లోకమంతా పచ్చగా కనిపి స్తుందంటారు మనిషి సంబంధాలను జాగ్రత్తగా కాపాడు కోవడం” అలోచనలకు ప్రతి రూపం, నీవు మనిషి గాఏది ఆలోచిస్తావో అదే అవుతారు.”ఇతరు ల నుంచి నీవు ఏమి ఆశిస్తావో నీవు దానినే ఇతరులకు చేయడం ప్రేమించడమే అవుతుంది. కలసి ఉంటే కలదు సుఖం నలుగురి తో కలసి ఉంటేనే మన గురించి ఒకడికి,పదిమందికి,ఊరికి,ప్రపంచానికి తెలిసేది. అమ్మా నాన్న, అన్న, బాబాయి, పిన్ని, తమ్ముడు, అక్క, చెల్లి, కూతురు, బిడ్ఢ, తాత, అవ్వ, మామ, అత్త, ఇలా,ఎందరో, ఇలాఒకరినోకరు కూడా ప్రేమిస్తారు. ఇదే నాన జీవితం అంటే నీఇష్టా ఇష్టం కన్న ఎదుటి వాడి సమాజం లో ని జనంతో కలసి బ్రతకడమేరా నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రేమ ను నటిస్తూ “ఇలా కూడా ప్రేమిస్తారా” అన్నట్లు గా సాగాలి జీవితం శతీష్ నాన అని చెప్పగా చెప్పడం రావు.

అప్పటికే చాల టైమ్ అవ్ళగా నిద్రపో నాన్న శతీష్ అని చెప్పిరావు తన బెడ్ రూమ్ కి వచ్చి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ “ఇలా కూడా ప్రేమిస్తారా డాడీ అన్నా తన కొడుకు శతీష్ మాటలకి నవ్వు కొని “నిద్రపోయాడు”రావు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!