విచిత్రమైన ప్రేమ

విచిత్రమైన ప్రేమ

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

గొపాలరావు ఒక ప్రభుత్వపాఠశాలలో ఉపాధ్యాయుడు.ఒక మంచి ఉపాధ్యాయుడుగా పేరుపొందాడు. ఆయన ఇంతవరకు పెళ్ళి చేసుకోలేదు. అదే ఆ పాఠశాలలోని అందరికి చర్చనీయాంశమైంది. ఆయనను ప్రత్యక్షంగా అడగలేక వెనుక గుసగుసలాడుకోవటం చేయసాగేరు. గొపాలరావు వాటిని పెద్దగా పట్టించుకునేవాడుకాదు. పుకార్లను నమ్మినంతగా
నిజాలను నమ్మలేని జనాలున్న సమాజం మనది. తమగురించికంటే ఇతరులగురించి ఆసక్తి చూపేవారే
ఎక్కువ గా ఉంటారెందుకో మరి?
ఒకరోజు ఇరవైసంవత్సరాల కుర్రాడు గొపాలరావుని కలవడానికి వచ్చాడు.

రావడమేకాదు మాడాడి వున్నారా అని ప్యూన్ ని అడిగాడు.

ఆ వార్తని ఆ ప్యూన్ పాఠశాలలో అందరికి చేరవేయడమే.

దాంతో అందరు గుసగుసలాడుకోవటం ఆరంభమైంది. వాళ్ళ ఆ గుసగుసలను చూసి వాళ్ళకు స్పష్టతివ్వడానికి గొపాలరావే పూనుకున్నాడు.
ఆరోజు పాఠశాల అయిపోవడంతో అందరిని ఒకచోట కూర్చోపెట్టి తనగతచరిత్ర చెప్పనారంభించాడు.
“అవి నేను బి.ఈడి చదువుతున్నరోజులు. నాతోపాటు ఇద్దరు అమ్మాయిలు మరోకతను నలుగురం చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమిచేయాలన్నా అందరం కలిసే చేసేవాళ్ళం. రాజారావు సరోజ సావిత్రి వాళ్ళపేర్లు.
అలా సన్నిహితులమైన మేము ప్రేమికులుగా మారిపోయాం. రాజారావు సరోజను నేను సావిత్రిని ప్రేమించుకున్నాం.  బి.ఈడి పూర్తయ్యాక ఉద్యోగాలలో చేరాక పెళ్ళిళ్ళు చేసుకోవాలని నిర్ణయించుకున్నాము.
నిర్ణయించుకున్న ప్రకారము కేవలం చదువుమీదే పూర్తిగా దృష్టి పెట్టాము.

ఆఖరిరోజు బి.ఈడి పరీక్షలు రాసి అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఆ మర్నాడే ఎవరి ఊర్లకు వాళ్ళం. వెళ్ళిపోయాం. కొన్నాళ్ళవరకు నలుగరం కుటుంబసమస్యలవల్ల ఒకరికొకరం కలుసుకోవడంగాని మాట్లాడుకోవడంగాని జరగలేదు.
ఒకరోజు రాజారావు సరోజ హఠాత్తుగా వచ్చారు నా దగ్గరకి . వాళ్ళిద్దరు పెళ్ళిచేసుకున్నామని అది ఇంట్లోవాళ్ళని ఎదిరించి చేసుకున్నామని చెప్పారు. సావిత్రి సంగతి వాళ్ళకేమి తెలియదని చెప్పారు. మా ఇద్దరినికూడ ఆలస్యం చేయకుండా
పెళ్ళిచేసేసుకోమన్నారు. నేను చెప్పాను నా ఇంటిసమస్యలవలన నేను సావిత్రితో ఏమి మాట్లడలేదని .తన సంగతి ఏమి తెలియదని. తనూ ఏమి ఫోను చేసి మాట్లాడలేదు. రాజారావు సరోజ ఒకరోజు నా దగ్గర వుండి వెళ్ళిపోయారు. వాళ్ళున్నప్పుడే ఫోను చేసారు. కాని స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఎన్నిసార్లు చేసినా అదే
సమాధానం వస్తోంది. ఇక మరోరోజు చెయ్యోచ్చనుకొని ఊరుకున్నాం. నేను వాళ్ళు వెళ్ళిపోయాక నేను
ఎంతో ప్రయత్నించాను. కాని ఫోను కలవలేదు. చిన్న చిన్న పనులుండడం వలన నేను వాటిలో పడిపోయాను.సెంట్రల్ స్కూల్ ప్రకటన పడడం దానికి దరఖాస్తుచేయడం పరీక్షరాసి నాకు ఉద్యోగం రావడంతో చెన్నై వెళ్ళిపోయాను.

సావిత్రితో ఫోను కలవకపోవడం నాకు అనేక సందేహాలు వచ్చాయి. చెన్నైలో తెలుగువారి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సావిత్రిని చూశాను. తనతోపాటు పక్కన మగవ్యక్తి ఉండడంతో నాకు ఆశ్చర్యమేసింది. తను నన్నుచూసి తప్పుచేసినదానిలా తలవంచుకొని ఉండిపోయింది. పలకరించినా ఎవరో కొత్తవ్యక్తిని చూసినట్టు ప్రవర్తించింది. నేనే పరిచయం చేసుకున్నాను.వాళ్ళున్న చిరునామ అది తెలుసుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆ చిరునామకు వెళ్ళాను. సావిత్రి నన్ను అపరిచితుడిగానే మాట్లాడింది. సావిత్రి భర్త మాత్రం చాలా చనువుగా మాట్లాడేడు. అలా పరిచయం వాళ్ళాయనతో పెరిగింది. ఒకరోజు నేను వాళ్ళింటికి వెళ్ళేసరికి ఇంటికి తాళంవేసుంది. పొరుగువారినడిగితే హస్పిటల్కి వెళ్ళారని చెప్పారు. హస్పిటల్ గురించి కనుక్కొని వెళ్ళాను. సావిత్రి ప్రిగ్నెంటు నొప్పులు
రావడంతో వచ్చామని సావిత్రిభర్త చెప్పాడు. డెలివరి కష్టమని చెప్పారుట. ఒక అరగంట తరువాత నర్సు వచ్చి మగపిళ్ళాడు పుట్టాడని కాని సావిత్రి చనిపోయిందని చెప్పారు. సావిత్రి భర్తను ఓదార్చి దహనకార్యక్రమాలు పూర్తయ్యాక వచ్చేశాను. ఒక నెలరోజులవరకు నేను సావిత్రిభర్తను కలియలేదు.
తరువాత వెళ్ళినప్పటికి అతనికేదో ప్రమాదమైందని చనిపోయినట్టు తెలిసింది. పిల్లాడిని అనాధశరణాలయంవాళ్ళోచ్చి తీసుకొని వెళ్ళారని తెలిసింది. ఆ అనాధశరణాలయానికెళ్ళి ఆ పిల్లాడిని తీసుకొచ్చేశాను. ఆ పిల్లాడే ఈ పిల్లాడు. చిన్నప్పటినుంచి నేనే పెంచడంతో నన్నే తండ్రిగా పిలుస్తున్నాడు. వివరంగా రాజారావు వాళ్ళందరికి చెప్పాడు. ఇలా కూడా ప్రేమిస్తారా అనుకొని రాజారావుని ఎంతో గొప్ప ఉన్నతమైన వక్తిగా భావించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!