వాగ్దేవి వందనాలు

వాగ్దేవి వందనాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

అమ్మ నిన్ను తలంచి అక్షరాభ్యాసమునరించి వాక్శుద్ధితో
‘సరస్వతీ నమస్తుభ్యం’ అంచు అక్షరాలు దిద్దించి,
నా స్వరగానమై, మనశుద్ధి గావించి, నా కవనానికి ఊతమిచ్చి,
నా మదిన నిక్షిప్తమైన భావాల నొలకింపచేసి,
ప్రీతితో ఆలకించి, ఆత్మశుద్ధి కావించి,
నా జీవమై, నా జీవనభృతివై, నా యశస్సువై,
నా తపనవై, నా సర్వస్వమై,
నా మార్గదర్శివై, నా తోడువై నిలిచి గమ్యంబు చేర్చి,
నీ కృపా సాగరంబున ముంచి
నా కలను సాకారమనరించిన వాగ్దేవి
నా శిరస్సు వంచి నీ చరణద్వయం చెంత సదా కవన సుమాంజలులనర్పింతు
నా భాషమృతాన్ని మనసారా గ్రోలి సంతసంబువై
నా ఆత్మలో నిలచి నా కవనాన్నికూతమై, నా జిహ్వపై అక్షర రాశివై,
నీ పాదామృతం చిలకరించుమా, సకల కార్యాలకాదివైన శార్వాణి,
నీ సేవాభిలాషిని అక్షర ముత్యాల హారాల కవనసుమాలచే భూషింతు,
నీ చరణముల చేరి అనవరతం స్వరగానాల కీర్తనలచే పాదాభిషేకం గావింతు,
వీణా పుస్తకధారిణి, వాణీ, వాగ్దేవి, నీకు వందనాలు వందనాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!