విప్లవం

విప్లవం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: V T రాజగోపాలన్

విజయానికి తెప్పలా తేలాలి మన భావనలు,
అంతే కానీ, విప్లవం అంటే తిరుగుబాటు కాదు, దౌర్జన్యం కాదు, రక్తం చూడటం కాదు,
మనసు భాధ పెట్టడం కాదు కంట నీరు రాకుండా,
కంఠం నుంచి విషపు మాటలు రాకుండా అనునయమైన మాటలు
కుప్పలు తెప్పలుగా జనులకు వినిపించి
వారిని విజయపథం వైపుకు తీసుకు పోవడమే విప్లవం అంటేను.
మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోయడం,
వాటిని శ్రద్దగా పెంచడం, చెట్టుగా మార్చడం,
వీటి అవసరాలను జనులకు తెలియపరచడం
వంటి విషయాలు..విప్లవం కిందే లెక్క. హరితవిప్లవం.
ప్లాస్టిక్ వాడకం ఆపుదాం, ప్రకృతిని కాపాడుదాం, అందరినీ మేలుకొలుపుదాం,
అందరిచే ఆచరింప చేద్దాం, ఇదికూడా విప్లవమే
బాల కార్మీకులు లేకుండా చూడడం,
అక్షరాస్యతను పెంచడం, చదువు వద్దన్న వారిని,
బడిలో చేర్పించేందుకు తగిన సహాయ
సహకారాలు చేయడం.
వీలైతే పేదలకు మనం నేరుగా సహాయం చేయడం.
ఇవి కూడా చాప కింద నీళ్లలాగా విప్లవం కిందే.
మానవతావాదం, పెద్దలను, గురువులను గౌరవించడం, రోజూ దైవాన్ని పూజించడం,
శ్లోకాలు పఠించడం, సహాయ గుణం ఇటువంటివి మన పిల్లలకు మనం నేర్పించేది,
విప్లవం కిందే లెక్క.
కుటుంబంలో ఓర్పుతోనే అందరినీ మెప్పించి జీవనం సాగిస్తున్న వ్యక్తుల నడవడికలు నిశ్శబ్ద విప్లవమే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!