రాధమ్మ అరెసలు

రాధమ్మ అరెసలు

రచన: యాంబాకం

ఓ గ్రామంలో రాధమ్మ అనే ఒక ఇల్లాలు ఉండేది .ఆమె భర్త “భద్రయ్య”అనే ఆయన ఇద్దరు కలసి మిఠాయిలు తయారు చేసి అమ్మి వాటితో వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తూఉండేవారు.రాధమ్మ అరెసలు చేయడంలో కొట్టిన పిండి .”రాధమ్మ అరెసలు” ఒక్క సారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.రాధమ్మ భర్త భద్రయ్య మిఠాయిలు తీసుకోని పక్క ఊరు లో అమ్ముతూఉంటాడు. . అందుకే భద్రయ్య ఇంటికి ఎప్పుడు వస్తాడో చెప్పటం కష్టం.ఒక్కోసారి పొరుగూరులో నే బసచేసి వస్తాడు. అటువంటప్పుడు ఇంటి దగ్గర రాధమ్మ ఒక్కర్తే కాలం గడపవలసివచ్చేది. రాధమ్మ కు చాలా భక్తి ఊరు లో ఉన్నగుడులన్ని తిరుగుతూ ఉపవాసాలు చేయడం అమె అలవాటు ,దేవాలయంలో “గర్బగుడిలో దేవుని తో స్వామి! దర్శనం విప్పించవా? ఈ ప్రసాదలు స్వీకరించు అని చెప్పి దేవుణ్ణి మరి మరి వేడుకొనేది. అస్తమానం ఈ పూజలు భద్రయ్యకు నచ్చేది కాదు ఆరోగ్యం పాడవుతుందని రాధమ్మను హెచ్చరించే వాడు.
ఇలా అమె రోజు ప్రార్థంచటం గుడిలో పూజారి కూడ కనిపెట్టుతూ అమె అమాయకత్వానికి లోలోపల నవ్వుకొనేవాడు. ఒక రోజున అమె మాములు ప్రకారం ప్రార్థిస్తూవుండగా పూజారి నీకోరిక తీరాలంటే స్వామికి ఏమైనా నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లిస్తే నీకు తప్పక నీకోరిక తీరుతుంది అని రాధమ్మకు ఉపదేశించాడు.
ఆస్వామివారేపూజారి నోటపలికించిన పలుకులనే అని నమ్మి రాధమ్మ చాలా సంతోషించింది. వెంటనే ఇంటికి చేరుకొని భక్తి కొద్దీ ఇల్లు శుభ్రం చేసుకుంది.వేకువజామునే లేచి భక్తితో రుచిగా సుచిగా అరెసలు తయారు చేసుకొని గుడికి వెళ్లి అరెసల నైవేద్యం సమర్పించుకొని అక్కడ ఉండే పూజరితో పాటు,గుడిముందర ఉండే సన్యాసి కి కూడ అరెసల ప్రసాదం పెట్టి ఇంటకి తిరిగి వచ్చింది రాధమ్మ.
రాధమ్మ అరెసలు రుచి చూసిన సన్యాసి, పూజారి కి అరెసలు తిని తృప్తి చెందక “రాధమ్మ అరెసల”ను ఎలాగైన మరల తినాలనే ఆశపుట్టంది. కాని వారి దగ్గర డబ్బు లేదు ఎలా అని ఆలోచించ సాగారు.కొన్నిరోజు తరువాత సాయంత్రం వేళ సన్యాసి భిక్షగాడు రాధమ్మ ఉన్న వీధిలోకి వచ్చి భిక్షాటన చేయసాగాడు ఇది చూసిన రాధమ్మ నాభక్తినిమెచ్చి ఆస్వామి ఈరూపం లో వచ్చాడనుకొని! రండి స్వామి రండి, ఈ ధీనురాలి ఆతిధ్యాన్ని స్వీకరించచండి అంటూ పిలిచింది. సన్యాసి మాత్రం ఒకపక్క సంతోషం అరెసలు దొరికాయని మరోపక్క ఆశ్చర్యపోయాడు “నేను సన్యాసి ,భిక్షకుణ్ణి అన్నాడు ఎంత చెప్పినా అమె వినక నిర్భందించే సరికి గత్యంతరం లేక తన కోరిక సులువుగా తీరుతున్నందుకు లోనపలికి వెళ్ళాడు.
ఆ సన్యాసి కి పీటవేసి కూర్చోబెట్టి చక్కగా భిక్ష పెట్టింది భక్తి తో రాధమ్మ .దొరికిందే చాలునని వాడుబాగా అరగించాడు ఐతే ఎవరైనా వచ్చి,ఈ రూపంలో వున్న తనను చూస్తే ప్రమాదమని ఒకవంక భయపడుతూనే, వాడు అరెసలు అడిగి మరి పెట్టించుకొని భోజనం పూర్తి చేశాడు. సన్యాసి భోజనంచేన్తున్నంత సేపూ అమె భక్తి కొద్దీ గానం చేసింది అంతలో ‘ఓ భక్తురాలా! తలుపు తెరువు’ అనేపిలుపు వినపడింది చూడగా విభూతి రేఖలు దండిగా ధరించిన గుడిపూజారి ప్రత్యక్షమయ్యాడు.”ఓహో ఇప్పుడు వచ్చిన ఈయనే నిజంగా స్వామి ఇంతకుముందు వచ్చినది భిచ్చగాడే అనుకొని సన్యాసిని చీకటిగా వుండే అటకపైన దాక్కోబెట్టింది రాధమ్మ. పూజారిని ఎంతో భక్తితో లోపలికి పిలుచుకు వచ్చి,అతనికి సమస్తమైన ఉపచారులు చేసి, సత్కరించింది. పూజారికి కూడ అరెసలు,గారెలు తో భోజనం వడ్డించి ఇప్పుడు కూడ ఈ స్వామి మెచ్చుకోవాలని అమె భక్తి తో గానంచేసింది.
ఆ సమయాన భైట ఎవరో వచ్చే శబ్ధం వినిపించింది. చూస్తే వచ్చేవాడు అమె భర్త! వెంటనే రాధమ్మ పూజారి దేవుడికి నమస్కరించి “స్వామి నాభర్తకు దేవుడంటే విశ్వాసం లేదు. పైగా చాలా కోపిష్టి వారు శాంతించే వరకూ మీరు కాస్త ఆ అటకమీద ఉండండి!”అంటూ అతనిని కూడా దాక్కోపెట్టింది. ఎటు పారి పోదామన్న దోవా తెన్ను కనపబడక పూజారి కూడా అటక ఎక్కి ఒక పక్కన పడుకున్నాడు. సన్యాసి కడుపు నిండింది కనుక ఇట్టేనిద్ర పట్టేసింది వాడు మరోకమూల ఉండటంచేత, పూజారి వచ్చిన సంగతి తెలియలేదు.మరి కొంచెం సేపటికి పూజారికి నిద్రపట్టింది.
రాధమ్మ భర్త భద్రయ్య ఇదంతా ఏమిటీ ఈ అట్టహాసం!అని అడిగాడు అందుకామె మీరి ఈవాళ వస్తారని కళ వచ్చింది. అందుకే నేను ఇవన్ని చేశాను అని సర్ధి చెప్పింది .అతడు సంతోషించి, విశ్రాంతి తీసుకొని, వెంటనే పడుకొన్నాడు.
అర్ధ రాత్రి అయింది పొట్ట నిండా అపూర్వమైన భోజనం తిన్న సన్యాసికి దాహం వేసింది మంచినీళ్ళు! మంచినీళ్ళు!! అని బిగ్గరగా అరిచాడు ఈ అరుపు చెవినబడి రాధమ్మ భర్త కు మెలకు వచ్చింది “ఏమిటది”?అని అడిగాడు.అమె”మనం మరి పితృదేవతలకు చేయవలసిన కర్మలు ఆచరింపటం లేదు కదా. అందుకెనే వాళ్ళు రెండు రోజుల నుండి ఇలా ప్రత్యక్షమతున్నారు.”అని యుక్తి గా సమాధానం చెప్పంది. పైకి చూస్తూ ఓ పెద్ధలారా! ఇకపైన మీకు చేయవలసి కర్మ జరిపిస్తాము మన్నించండి అంటూ ప్రార్ధించాడుభద్రయ్య.అటక పై ఉన్న సన్యసి కి గొంతు ఎండు కు పోవడంచేత”నీళ్శ!నీళ్లు!!అని మళ్ళీ ఒకసారి అరిచాడు.
రాధమ్మ అటక వైపు తిరిగి ఓదైవమా! తూర్పుదిక్కున టెంకాయ వున్నది. అక్కడనే గుండురాయి వుంది దానితో కాయకొట్టుకొని ఆనీళ్ళ తాగి శాంతించు, అన్నది ప్రాధేయపడుతూ. ఈ మాటలోని అర్థాన్ని గ్రహించిన సన్యాసి అటక మీద తూర్పు దిక్కున వెతకగా చెప్పినట్టుగానే టెంకాయ దొరికింది. తరువాత రాయి కోసం వెతికే సరికి పండుకొని వున్న పూజారి గుండు ఆచీకటిలో చేతికి తగిలింది. అదే గుండురాయి అనుకొని సన్యాసి వెంటనే టెంకాయను దానిమీద కొట్టాడు. తల పగిలేసరికి అయ్యో!అబ్బా!అబ్బా!అంటూ పూజారి గోలపెట్టాడు ఎమి తెలియక ఆ చీకటిలో కంగారుతో తడుములాడేసరికి,అతనికి సన్యాసి చెయ్యి దొరికింది.ఇద్దరూ కలియబడ్డారు.
కింద వున్న భద్రయ్య ఈ గోల విని భయపడ్డాను. రాధమ్మ హడలిపోతూ “హయ్యో దేవతలకు ఇవాళ ఉగ్రం వచ్చేసింది. రోజూ మీరు వచ్చేవరకూ శాంతంగా ఉండండి అని వెడుకొంటే అలాగే ఉండేవాళ్ళ,ఇవాళ మీరు వచ్చారని తెలిసి కాబోలు వాళ్ళు ఆగ్రహం చెందినట్టు కనబడుతుంది అని చెప్పింది.అంతలో అటక పై నుంచి వాళ్ళిద్దరూ దబ్బున కింద పడటం చూచాడు .భద్రయ్య భయంతో హడలుకొంటూ బైటకు వుడాయించాడు. ఒక్క పరుగుతో వెనుక సన్యాసి,పూజారి కూడా పరుగులు తీశారు. ఇది చూసిన భద్రయ్య ఆ దేవత లే తనను వెంటాడు తున్నారనుకొని!”బాబూ!నన్ను విడిచి పెట్టండి! మీకు ఏటా చేయవలసిన కర్మలన్ని చేస్తా!”అని బతిమలాడుకొంటూ పోసాగాడు‌.
ఈ అదనులో సన్యాసి పూజారి వాళ్ళ దారిన వాళ్లు వెళ్ళి పోయారు .
ఏం చెయ్యగలరు పాపం,రాధమ్మ! నమ్మిన దేవుళ్ళు లీలలకు విస్తు పోయింది.అమె భక్తి చివరకు ఇలా ఫలించింది.

—-

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!