అదృష్టం

అదృష్టం

రచన: జీ వీ నాయుడు (కలం: వీణ)

రాజు, రోహిణి లకు ఓకే కూతురు. రోజు 50 కిలోమీటర్లు దూరం లో కళాశాలకు స్కూటి లో ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుంది. ఒక రోజు అదే మార్గం లో వెళ్తున్న కుమార్తె రోజ ఎదురు గా వస్తున్న ఓ పాపను తప్పించ బోయి సడన్ బ్రేక్ వేయడం తో, ఆమె బ్యాలెన్స్ తప్పి కింద పడింది. తల రాయి ఫై పడడం తో తల కు బలమైన గాయం అయింది.. స్పృహ కోల్పోయింది.. అటుగా కారు లో వెళ్తున్న రాజేష్ రక్తం మడుగులో పడి ఉన్న రోజా ను చూసి చలించి పోయాడు. పాపం ఎవరో స్టూడెంట్ లా ఉంది.. ఏమైందో ఏమో అని తన కారులో డ్రైవర్ సహాయం తో ఆమెను సమీపంలో నీ ఓ ప్రవేటు ఆసుపత్రి కీ తీసుకొని వెళ్లి డాక్టర్ తో మాట్లాడి జాయిన్ చేశారు. ఓ గంట తరువాత డాక్టర్ వచ్చి ఈమెకు ఏమీ ప్రమాదం లేదని కొద్దీ సేపట్లో స్పృహ వస్తుంది అని చెప్పారు.. రాజేష్ కు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఎవరో వారికి సమాచారం అందించాలని ఆలోచిస్తాడు.
వెంటనే ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి స్కూటి లో తన బుక్స్ ఐ డి కార్డ్ చూసి ఆమె రోజ అని నిర్ధారణ కు వచ్చాడు. ఐడి కార్డ్ లో ఉన్న నెంబర్ కు కాల్ చేసాడు రాజేష్.. తన తండ్రి కాల్ లిఫ్ట్ చెయ్యగానే ప్రమాదం విషయం చెబుతాడు రాజేష్.. ప్రస్తుతం ప్రమాదం లేదని ఆసుపత్రి లో ఉందని చెప్పడం తో తల్లిదండ్రులు అక్కడ కు వస్తారు. రాజేష్ ” నువ్వు మా బిడ్డ ను సకాలంలో లో కాపాడావు. నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేము ” అని కృతజ్ఞతలు చెబుతారు. ఇంతలోనే డాక్టర్ వచ్చి ఆ పాప స్పృహ లో ఉందని వెళ్లి కలవమని రాజేష్ కు చెబుతాడు.. ఆఅమ్మాయి తల్లిదండ్రులు వీరు అని రాజేష్ డాక్టర్ కు పరిచయం చేస్తారు. రోజ దగ్గరికి వెళ్లి తల్లిదండ్రులు విలపిస్తూ ఏమైంది అని అడుగుతారు. రాజేష్ పక్కన ఉండి తాను ఏ స్థితి లో ఆసుపత్రి కీ తీసుకొని వచ్చానో చెబుతాడు.. రోజా ” నా ప్రాణాన్ని కాపాడేరు. మీకు జీవితాంతం రుణ పడి ఉంటాను సార్ ” అని రెండు చేతులు పట్టుకొని కృతజ్ఞతలు తెలిపింది.
రెండు రోజులు గడిచాయి. రోజ ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయింది. ఓ వ్యక్తి మానవత్వం ఎంత పని చేసింది. ” రాజేష్.. నాకెందుకు అని అనుకుని ఉంటే, నేను ఇపుడు ప్రాణం తో ఉండేదాన్నా, ఇలాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం. ఇలాంటి వాడిని భర్త గా పొందాలి ” అంటూ తనలో తానే మాట్లాడుకోవడం తల్లిదండ్రులు చెవిన పడింది
రోజా వాళ్ళ కళాశాలలో వార్షికోత్సవం జరుగుతుంది. ఆ వార్షికోత్సవ సభ కు రాజేష్ చీఫ్ గెస్ట్. రాజేష్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకీ మేనేజింగ్ డైరెక్టర్. ఆ కాలేజీ లో రోజాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ మెడల్ ను వేదిక పైన ఉన్న రాజేష్ చేతులమీదుగా రోజ మేడలో వేశారు రాజేష్. అనంతరం రోజ మాట్లాడేందుకు మైక్ ముందుకు వచ్చింది. ” ఈ రోజు చాలా శుభదినం. నాకు గోల్డ్ మెడల్ వచ్చిన ఆనందం కన్నా, ఈ మెడల్ ను నా ప్రాణ దాత చేతులు మీద గా పొందడం చెప్పలేని ఆనందం కలిగింది. దేవుడు ఎప్పుడు ఏమీ చేస్తారో, ఎవర్ని ఎక్కడ కలుపుతారో అంతా ఓ అద్భుతం. ఈ గోల్డ్ మెడల్ వెనుక నా కృషి కన్నా నా గురువులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల కృషి ఎంతో ఉంది. వారందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. రాజేష్ గారికి పాధాభివందనం. ” అని ముగించింది రోజ. రాజేష్ మాట్లాడుతూ ” నిజం గా ఈ రోజు నేను మరచిపోలేను. రోజా కు నా చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బాహూకరించడం చాలా అదృష్టం గా భావిస్తున్నా.. ఇంత మంచి విద్యార్థినీనీ నేను ప్రమాదం జరిగినపుడు కాపాడా అని గర్వం గా ఉంది.. ఆమెకు మా కంపెనిలో ఉద్యోగం కల్పిస్తాను ” అని ప్రకటించి గొప్ప తనం చాటుకున్నారు.
అనంతరం ఆమె ఉద్యోగం లో చేరడం, ఆ కంపెనీ లాబాలల్లోదూసుకోపోయింది.
రాజేష్, రోజా ఇద్దరు ఇష్టపడడం తో అంగరంగ వైభవం గా వివాహం చేసుకున్నారు. రోజ తన స్నేహితులు అందరికి ఉపాధి కల్పించి శహాభాష్ అనిపించుకున్నది.

…….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!