మహీరుహ మనవి

 మహీరుహ మనవి

రచయిత:: నాగ మయూరి

మొలకను నేను చిట్టి మొక్కను నేను

పుడమి తల్లి గర్బాన విత్తునై పురుడోసుకున్న లేత మొక్కను నేను

వృక్షో రక్షతి రక్షితః అన్న నినాదాన్ని గుర్తెరిగి నను రక్షించగ రా ఓయి మనిషీ

పాదులు చేసి, నీటిని పోసి పెంచగనే వృక్షాన్నవుతాను

అమృత ఫలములనిస్తూ అమ్మనవుతాను

జీవులన్నింటికి నిలువ నీడనిస్తూ నాన్ననవుతాను

ప్రాణ వాయువునిస్తూ ప్రాణదాతనవుతాను

ఎండ,వాన, చలినుండి నిను రక్షించే నీఇంటికి తలుపును నేను

పుట్టిన బిడ్డకు ఊయల నేను

గిట్టిన మనిషికి పాడెను నేను

అన్నింట నీ వెంట నిలిచే నన్ను కాపాడవోయి నరుడా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!