ఎందుకనీ

ఎందుకనీ 

రచన::పి.సుష్మ

మారిపోతవెందుకని
నిన్ను దూరంగా చూసే ప్రపంచానికి,
నీకు దగ్గరగా ఉన్న ప్రపంచాన్ని దూరంగా నెట్టుతావెందుకని
కూర్చొని లోకం ఇంతేనా అని అంచనా వేసి,
లేచాక లోలకంలా ఊగుతావెందుకని.
నీలా నువ్వు ఉండవెందుకని,
ఒకరి చూపుకై
నిన్ను నువ్వు చీప్ గా చేసుకుంటావెందుకని.
అవసరానికో,అవకాశాలకోసమో,
ఆత్మభిమానాన్ని చంపి సలాం అంటూ వంగిపోతావెందుకని.
నిన్ను తక్కువ అన్నవాడిని
వాడు నాకంటే ఎక్కువే అదృష్టంమంటూ పొగుడుతావెందుకని.
నటిస్తావెందుకని
బ్రతకడం చేతకాక
నిన్ను నువ్వు కోల్పోతావెందుకని
నీది కాని ప్రపంచంకోసం.
నువ్వు నడిపించేదై ప్రపంచం ఉండాలి
నిన్ను నడిపించేదై కాదు.
నీ జీవితం చరిత్రై ఉండాలి,
చరిత్ర చదువుతూ మిగిలిపోయేలా కాదు
నువ్వు నీలా ఉండూ
వేరెవాళ్ళలా ఉండాలనుకుంటే నువ్వుఅనేది ఎందుకని.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!