రావోయి సందమామ

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

రావోయి సందమామ

రచయిత :: చంద్రకళ. దీకొండ

సెప్పిందే సెపుతుంటడు
ఇనకపోతే సెవుడా ఏందంటాడు…!
సేసిందే సేస్తుంటడు
ఎందుకంటె కోపానికత్తడు…!
కడిగిన సేతులే కడుగుతుంటడు
వద్దంటే తగువులాటకు దిగుతడు…!
సదివిన పేపరే సదువుతుంటడు
సంగతులేందంటే ఏవున్నయంటడు…!
ఇన్న వార్తలే ఇంటుంటడు
ఇసుగు పుట్టదా అంటే ఏసేవాళ్ళకి లేని ఇసుగు నాకెందుకంటడు…!
సూసిన సినిమే సూస్తుంటాడు
ఛానల్ మారిత్తే గయ్యిమంటడు…!

గంట ముందే కొలువుకు వోతడు
ఎవ్వడు రాలేదేందని ఎగురుతుంటడు…!

చాయ్ ల తీపెక్కువైందంటడు
తగ్గిస్తే సప్పగుందంటడు…!
కూరల ఉప్పెక్కువైందటడు
తక్కువేస్తే బి.పి.అనుకున్నవా
అంటడు…!
కమ్మగ వండిపెడితె అమ్మని తల్సుకుంటడు
వండింది నేను కదా అంటే
తెచ్చింది నేను కదా అంటడు…!
ఇయ్యాల గెహనమని వండినయన్నీ పారబొయ్యమన్నడు
ఉపాసం ఉండమంటె ఊరంత
ఇనబడేట్టు అరిసిండు…!

ఈ కాపురమెట్ట సేయాల్నో…
రావోయి సందమామ…
ఈ వింత మొగుని గాథ ఇనుమా…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!