మొండి మొగుడు

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

మొండి మొగుడు

రచయిత :: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

అన్నాడంటే ఇక చేస్తాడంతే
తప్పా ఒప్పా కనిపించదు అంతే….

వద్దన్నాడా ఇక ముట్టడు అంతే
ఆకలి దప్పిక గుర్తుండదు అంతే…

కోరిన కోర్కెకు లెక్కలేస్తాడంతే
భార్య మనసుతో పని లేదంతే…

అవసరమైనా అడుక్కోవాలంతే
కనికరమైనా కలగని గుండెయది అంతే

ఆస్పత్రికి పోదామంటే నాటుమందంటాడంతే
జిలకర మిరియాలు మింగిస్తాడంతే…

మొగుడు మొండాడైతే మన పని అంతే
చాదస్తం నిండితే కష్టపడక తప్పదంతే….!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!