(అంశం: ” పెంకి పెళ్ళాం”)
తానే- తను
రచన :: జయకుమారి
నా ముంగిట వెలిసిన వెన్నల్లమ్మ తను.
కోపం వస్తే మండే సూరీడు కూడా తానే.
ఆకాశమంత ప్రేమ తను.
తేడ వస్తే ఉరిమై ఉరిమే ఆవేశం తానే.
ఆమె పలుకులు ఉరకలు వేసే పిల్లగోదారి తను.
ఒకోసారి ఉప్పెనలా మనల్ని ముంచేసే సునామీ తానే.
ఆమె మా అందరికీ ప్రేమ ను పంచే అమ్మ తను.
తేడ వస్తే అందరి తాట తీసే అమ్మోరు తల్లి కూడా తానే.
మంచితనం తను.
మొండితనం కూడా తానే.
చిందులు వేసే చిద్విలాసం తను.
అంతలోనే బుంగమూతి పెట్టుకునే పసిపాప కూడా తానే.
మొత్తానికి చిత్తరాల దేవుడు.
చిత్రించిన చిత్రాంగీ నా పెంకిపెళ్ళాం.
Bagundhi jaya