మాటకారి పెళ్లాం

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

మాటకారి పెళ్లాం

రచన :: పుల్లూరి సాయిప్రియ

నాకుంది ఒ మొండి పెళ్ళాం
అది ఎం చేస్తుందో ఒక్కోసారి దానికే తెలీదు
ఎప్పుడు ఎదో ఒకదానికి లబ లబ అంటు నోరు ఆడిస్తూనే ఉంటుంది.
చీటీకి మాటికి తన మాటలతో చురుకులు అంటిస్తూనే ఉంటుంది.
ఏదైన కావాలి అంటె మాత్రం మెల్లిగా తన మాటల చేష్టలతో నా మనసును ఐసుల కరిగిస్తుంది.
ఒ రోజు ఏమైందో తెలుసా..
ఒకరోజు కోడికూత తో మొదలైన అత్త కోడళ్ల జగడం నేను డ్యూటీకి వెళ్లెంత వరకు జరుగుతూనే ఉంది. వాళ్లని ఆపలేక నా పనేదో చేసుకుంటానని డ్యూటీకి వెళ్లిపోయాను. అక్కడికి వెళ్లిన కూడ నాకు ఎం తోచలేదు వాళ్ల గోడవని ఏలా ఆపాలని ఆలోచిస్తూ ఇంటికి వెళ్లాను.
వెళ్లి వాళ్లను చూసి షాక్ అయ్యాను.ఎదుకంటె అంత గోడవ పెట్టుకున్న నా పెళ్లాం , అసలేం జరగనట్టు అత్తకోడళ్లు ఇద్దరు కలిసిపోయారు. పైగా ఒకరినొకరు పోగుడుకుంటూ ఉన్నారు. ఇది ఏలా అని నా పెళ్లాన్ని అడిగితే,,
ఎం లేదండి ఈ గోడవ ఏలా అపాలో తెలిక మెల్లిగా మాట మాట కలుపుతూ మీ అమ్మాగారిని పొగడడం మొదలెట్టాను అంతే చీటికెలో కోపం అంతా చల్లారిపోయింది. అని చెప్పింది.
అలా చెప్పగానే,
దానిని పెంకి పెళ్లాం అనాలో, లేక ఇంక ఏమానాలో నాకు అర్థం కాలేదు. కాని నా పెళ్లాం మాత్రం ఎంతో మాటకారి అని నాకు అప్పుడే అర్థం అయింది.
చూసార తన మాటలతో అందరిని అలా కట్టి పడేస్తుంది అంతే.
అదే నా పెంకి పెళ్లాం.. నా మంచి పెళ్లాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!