ప్రేమ అనే పల్లం వైపు

కథ అంశం: బంధాల మధ్య ప్రేమ-2080

ప్రేమ అనే పల్లం వైపు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యల్. నిర్మల

ఒకరిని ప్రేమించామంటే…
ఏమీ ఆశించకుండా
కడవరకు ప్రేమిస్తూనే ఉండటం.
అసలు ప్రేమించడం అంటే,
స్థితిగతులని చూడడం కాదు.
అందచందాలను చూడడం కాదు.
ఒప్పందం అంతకన్నా కాదు.

పై వాటిని చూసి ప్రేమ అనే పేరు పెట్టుకుని ముందుకు వెళ్తుంటారు. నాటి తరం నుండి తరతరాలు వారికి మనం అనుకున్నట్టు అది ప్రేమ కాదు అవసరం. అంతే నేడు మనలో ఆలోచనలు రేపటి తరం వారికి ప్రేరణ కలిగించేలా ఉండాలి. స్వార్దం తో కూడిన ప్రేమ అవసరం తీరుతున్నంత కాలం బాగుంటుంది. తీరకపోతే ద్వేషం, కోపం, కక్ష, చిరాకు, ఇలా ఎన్నైనా వస్తాయి, ఆఖరికి ప్రాణాలు తీసేదాక పోవడం చూశాం.
ప్రేమ అనేది మనసులో పుట్టేది. ఒకసారి మనస్ఫూర్తిగా ప్రేమించామంటే ఆ వ్యక్తిని పూర్తిగా స్వచ్చంగా ప్రేమిస్తూనే ఉండాలి. తప్పులు జరిగినా ప్రేమతోనే జయించాలి దీన్నే కదా ప్రేమ అనేది.
ప్రేమను ఒక జీవనదితో పోల్చవచ్చు. నది ప్రేమ అనే పల్లం వైపు  ప్రవహిస్తూనే ఉంటుంది.
ఆ ప్రవాహంలో ఎన్నో అడ్డంకులు, మంచి చెడులు (ముళ్ళు, కుళ్ళులు, చెడులు, ఎదురుదెబ్బలే కాకుండా మంచి ఔషధాలను,రత్నాలను) తాకుతూ ప్రవహిస్తుంది. కష్టం అనే గుది బండరాయి అడ్డుపడినా ఆగిపోకుండా దాటుకుని వెళ్తుంది.
ఇష్టం అనే రత్నాలు, ఔషధీ మొక్కలు తగిలినా మురిసిపోయి అక్కడే ఆగిపోకుండా తన దారిన తను స్వేచ్ఛగా వెళ్లిపోతుంటుంది. కష్టాల, ఇష్టాల దగ్గరే ఆగిపోతే ఆ మనసనే నీరు త్వరగా పాడవుతుంది. మురికినీరుగా మారి స్వచ్ఛత కోల్పోతుంది. ఎంత చెడు ఎదురైనా తన మనసు నీటిలా స్వచ్చంగా ఉంచి స్వేచ్ఛగా సాగిపోతుంటుంది నది. ప్రేమ అనే పల్లం వైపు, ఇలా  నేటి తరం నుండి ముందు తరాలు వారికి నది(ప్రేమ)అనే  పల్లం వైపు  సాగుతూ పోవాలి.

You May Also Like

One thought on “ప్రేమ అనే పల్లం వైపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!