మామ్మ మనుమలు

 కథ అంశం: బంధాల మధ్య ప్రేమ-2080

మామ్మ మనుమలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

(ఆత్మావై పుత్రా నామేషి అన్నారు కదా, పెద్దవాళ్ళు అంశతో మళ్లీ పిల్లలుగా జన్మిస్తూ ఉంటారు, వారి అనురాగాలు తిరిగి పంచుకుంటూ ఉంటారు అనే సూత్రం ఆధారంగా ఒక ఊహాజనిత కథ ఇది, 2080 సంవత్సరం వచ్చే నాటికి బంధుత్వాలు లో ఒక తాత మామ్మ ల బంధం మనుమలతో ఎలా ఉంటుంది అని, పూర్వపు సానుకూల వాతావరణం తిరిగి వస్తుంది అని ఆశతో, కోరికతో వ్రాసినది)

హాయ్ మంజు ఏం చూస్తున్నావు అన్నాడు భార్య మంజుష ని అవినాష్.
ఏం ఉంది అవి! కాస్త పిల్లలకి టిఫిన్ చెయ్యమని అత్తమ్మ కి చెబుతున్నా, మన అబ్బాయి రామారావు కి ఏదో దిబ్బ పిజ్జా కావాలట. అదేంటో వాళ్ళ నానమ్మకే తెలుసుటా.
దిబ్బ పిజ్జా ఏమిటోయ్ అనుకుంటున్నారు ఇద్దరూ.
ఇంతలో సత్యవతి గారు వచ్చి రారా నాన్న నేను నీకు కావలసింది చేశాను, తిందువు గానీ అంటూ పిలిచారు.
ఏమటది అత్తమ్మా అంది కోడలు.
ఏం లేదర్రా మా రోజుల్లో దిబ్బ రొట్టె అని చక్కగా కాల్చుకుని తేనె పానకం వేసుకుని తినే వాళ్ళం. మీ వయసులో దిక్కుమాలిన పిజ్జాలు అనీ కాలీ కాలకా, ఏవో ఓవెన్ లో పెట్టుకుని తినే వారు అదే వీళ్ళకి ఇలా చెప్పా. వీడికి అది ఎంతో ఇష్టం, అన్నారు.
ఇంతలో మనుమడు రామారావు వాళ్ళ అమ్మతో ఇంచక్క నానమ్మ తాతయ్యని ఏవండీ అని పిలుస్తుంది నువ్వేమో నాన్నని అవీ అంటావేమిటి అన్నాడు.
సరెలేరా వెళ్ళు ఆ దిబ్బ పిజ్జా తిను అంది వాడికి ఏమి చెప్పాలో తెలియక.
ఇంతకీ వీళ్ళ పిల్లలకి చక్కగా వాళ్ళ తల్లి తండ్రులు, తాతల పేర్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు రోజులు మారాయి. పూర్వపు అలవాట్లు, ఆరోగ్య సూత్రాలు, ఉమ్మడి కుటుంబాలు అవీ తిరిగి కాల క్రమేణా బలపడి ఇలా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటున్నారు అన్నమాట.
అత్తగారి వెనుకే కోడలు కూడా వంటింట్లోకి నడచింది.
అవును అత్తయ్యా ఇప్పుడు ఎంతో హాయిగా ఉంటోంది కుటుంబం మనం అందరం కలిసి ఉండడం, ప్రేమ ఆప్యాయతలు ఒకరికి ఒకరం అన్న భరోసా ఎంతో చక్కగా ఉంది. ఇదేదో మేము రిటైర్ అవ్వక మునుపు అయితే ఎంత బాగుండేదో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇద్దరం ఉద్యోగాలకి ఉరకలు, పరుగులు తినీ తినక, రక్తపోటు, చెక్కెర వ్యాధులు మిగిలాయి చివరకి మా ఒంటరి జీవితాలకి సాక్ష్యంగా. పోనిలేవే ఏమైంది ఇప్పుడు చక్కగా ఉన్నాం కాదా. మీ మావగారికి, మీ ఆయనకి ఈ కాఫీ ఇచ్చిరా మనమూ తగుదాం అంటూ రెండు గ్లాసులు అందించి, రెండు గ్లాసులు అవిడ తీసుకుని అలా హాల్ లోకి నడిచారు.
మనుమరాలు సత్యవతి (మామ్మ గారి పేరే నండోయ్) వచ్చి మామ్మ నాకు ఈ రోజు ఆఫీస్ లో భోజనం ఉంది లంచ్ బాక్స్ వద్దు అంది.
సరే అన్నయ్య దిబ్బ రొట్టె తింటున్నాడు నువ్వు కూడా తిని వెళ్ళు అంటే అలాగే అంది.
ఈ అవినాష్, మంజూష వాళ్ళు కోల్పోయన శాంతియుత జీవితం పిల్లలు అనుభవిస్తున్నందుకు ఆనందంగా, మనుమలతో ముద్దు ముచ్చట్లు తీరుతున్నందుకు ఈ తాతమామ్మలు హాయిగా ఆరోగ్యంగా గడుపుతున్నారు.
సత్య (మనుమరాలు) మామ్మ దగ్గర చక్కగా వంటలూ అవీ నేర్చుకుంది. రామారావు (మనుమడు) తాతగారి అనుభవం బాధ్యతల తో రంగరించి చెప్పే విషయాలు చక్కగా పాటిస్తూ, చదువు ఆటపాటలతో బాటు మంచి ఉద్యోగం కూడా చేస్తూ  ఎంతో ఆనందంగా ఉన్నాడు. సాయంత్రం మళ్లీ ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుని ఇంటికి చేరాకా కాసేపు దూరంలో ఉండే పిల్లలు మనుమలతో, ఈ మనుమడు జూమ్ కాల్ చేసి ఇస్తే ఓ అరగంట గంట సేపు రోజూ అంతా మాట్లాడు కుంటూ ఉంటారు. తల్లిదండ్రులతో బాటు తాత నాన్నమ్మ లతో సమానంగా సమయం గడుపుతూ, అవసరమైన సలహా సంప్రదింపులు చేస్తూ ఈ మనుమలు కూడా ఎంతో ఉత్సాహంగా అభివృద్ది పథంలో ముందుకు నడుస్తున్నారు. ఏ పనైనా తాత, నానమ్మ లకు చెప్పి చేస్తూ ఉండడం అలవాటు చేసుకుని క్రమశిక్షణ తో ఉంటూ ఉంటారు.
నాన్నమ్మ! రేపు శ్రీరామ నవమి కి బెల్లం, ఏలకులు తెచ్చాను, పానకం కలపడానికి, విసనకర్ర లు కూడా తెచ్చా.
తాతయ్య మామిడి ఆకులు కోసారా, తోరణాలు ఇప్పుడే కట్టెస్తా అన్నాడు.
హా అన్నీ అయ్యాయి రా. ఎప్పుడూ లాగే రేపు ఉదయం కొంచెం ముందుగానే లేవండి, ఇంట్లో పూజ అయ్యాకా గుడికి వెళ్ళి రావాలి. అమ్మ వాళ్ళు రాములవారి కళ్యాణానికి పీటల మీద కూర్చుంటున్నారు, మీరు కూడా ఉండాలి అంది నాన్నమ్మ గారు.
అలాగే అన్నారు మనుమలు ఇద్దరూ.
ప్రస్తుత ఈ రాబోయే రోజుల్లో అలా మారి పాత ఆరోగ్య సూత్రాలు, అనుబంధాలతో, కొత్త సాంకేతికత, నైపుణ్యం కలయిక తో సాగుతూ ఉంటుందని ఆశిద్దాం.
అదండీ కథ.

You May Also Like

6 thoughts on “మామ్మ మనుమలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!