బంధం
రచయిత:; అమృతపూడి రేవతి
స్నేహానుబంధం
ఋణాను భంధం
ప్రేమానుభంధం
రక్తానుభంధం
ఎన్ని బంధాలో
ఎక్కడప్రేమలు
ఎక్కడి బంధాలు
అరిగి పోతున్నాయి
కరిగి పోతున్నాయి
కలల కౌగిలిలో వరిగిపోతున్నాయి
శృతులు లేవు
మతులులేవు
వెతలతో వ్యంగంగాఉన్నాయి
అలనాటి భంధాలు
అరుణకిరణం
అరుణకిరణంఆవిరైపోయే
అవని దాటుచున్న స్వార్ధాలు
బెదిరి పోవుచున్నవిబంధాలు
మంచిచెడులు చెప్పేవాళ్ళులేరు
చెప్పినా వినే వారు లేరు
ప్రకృతే వద్దు ఈబంధము అని
వికృతం ఐపోతున్నరోజులుఇవి
ఓ… మనిషి మారవా
మనుగడను సరిచేసుకో
మంచినే పెంచుకో
మనసుని మార్చుకో.