సూర్యోదయంలో ప్రకృతి పరవశించే వేళ… మగువ
భానుడి ఉషోదయ…సూర్యాస్తమయాలు…
పక్షుల కిలకిలరావాలతో…
మోనగీతం అలాపించమంటున్న…
పచ్చని పచ్చిక బయళ్లు రారమ్మంటూ స్వాగతతోరణాలతో ఆహ్వానం పలుకుతున్న…
చల్లని పిల్ల వాయువులు తన ఒడిలో సేదదీరమంటున్న…
వాటిని స్వాగతించే తీరిక ఏది…
మగువ జీవితానికి…
భానోదయంతో పాటు పలకరించే చీపురుకట్టలు…
వంటింటి గిన్నెల చప్పుడు లో కనుమరుగయ్యే…
పక్షుల కిలకిలారావాలు…
టీ… పలహారాల పిలుపులలో…
వెతుకులాటలయ్యే
పచ్చికల ఘుమాయింపులు…
అదిగో మా ఏమండి పిలుపు…
నా ఫోన్ చూసావా!?…
నా షర్ట్ ఇస్త్రీ చేసావా!?…
బాక్స్ సిద్దమయిందా!?…
అంటూ…
ఇవే మగువ జీవితానికి …
కిలకిలారావాలు… పచ్చని
స్వాగతతోరణాలు…
రచయిత: సావిత్రి తోట “జాహ్నవి”