యువ కెరటం

యువ కెరటం

బయట తిరిగితే బజారోడా అనకపోయినా
అడుగు బయటెట్టట్లేదు….
పండగలు పబ్బాలు విచ్చలవిడిగా చేస్తే
అడిగే నాథుడే లేకపోయినా ఏమీ చేయట్లేదు…
షికారులకు వెళ్ళి వినోదపు అంచును చూస్తే
ఎందుకెళ్ళావనే నోరే లేకపోయినా వెళ్ళట్లేదు…..
ప్రియురాలికి ప్రియ చుంబనం ఇచ్చినా
చూసే దిక్కే లేకపోయినా ఇవ్వట్లేదు….
ఆటలతో గ్రౌండు నిండితే పట్టించుకోక పోయినా
గ్రౌండు బోసి పోయింది…..
ఇది తల్లి దండ్రులు నిర్బంధించిన ఓ కుర్రాడి కథ కాదు
కోవిడ్ కాలంలో కరోనా రాకాసి నియంతృత్వంలో
దాని ఆధిపత్యాన నలిగి స్వీయ నిర్బంధియైన
ఓ యువ కెరటం గాథ….!

రచయిత :చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర )

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!