మసకల ముసుగు

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

మసకల ముసుగు

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

నా మది…
ఆనందాలను ఆవిరి కానీయక
కలకాలం నిలవాలని
భవితకై బాటలువేస్తూ
సరిదారిని ఎన్నుకోవా?అంటూ
ఆకాంక్షల చొక్కా తొడుగుతుంది..

నా మది…
కలల సాకారానికై
హృదయ కుహరాన్ని సిద్ధం చేసి
ముందడుగు వేయవెందుకు?అంటూ
ఉత్తేజ పరచి చప్పట్లు కొడుతుంది..

నా మది…
మత్తులో జోగుతూ
మనసుకు కప్పిన
మసకల ముసుగును విదిలించవా?అంటూ
బద్దకపు దుప్పటి విసిరి పారేయమంటుంది..!

************************************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!