అంతరంగం

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

అంతరంగం

రచన: యాంబాకం

పూల తోట తోటమాలి ని ఏలనోయి మేము అనగా నీకు అంత ప్రీతి అని పూల తోట అంతరంగం ప్రశ్నిస్తే

భూమి మానవుని ఎలనోయి నేను అనగా మీ మనుజులకు అంత మక్కువ అని భూమాత అంతరంగం ప్రశ్నిస్తే

అవినీతి ని మోసాన్ని. అధర్మమాన్ని ఏలనోయి మీ
ఉనికి నిచాటుతున్నారనని నీతి, ధర్మం యొక్క అంతరంగం ప్రశ్నిస్తే

ధనము అధికార గుప్పట్లో
సాగుతున్న దురాచారాలను పేద బడుగు నిసహయు ల అంతరంగం ప్రశ్నిస్తే.

చదువు సంస్కారం మంట కలుపు కళ్ళు ముందు జరుగు తున్నా అరాచకాలను చూడగలిగి చూడనటుల సాగిపోవు సాక్షు ల అంతరంగం ప్రశ్నిస్తే

రోజు రోజుకి పెరుగుతున్న ఈ
ప్రపంచ జనాభా లోని జీవన
పోరాటం లో మానవుల స్వార్థ బుద్ది అంతరంగం ప్రశ్నిస్తే

దేవుని కోవెల లో
దేవుని మొక్కులు తీర్చే భక్తుకే వరములు ఇచ్చే దేవుని తో భక్తుని అంతరంగం ప్రశ్నిస్తే
—————————————-

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!