తెలివైన తీర్పు

తెలివైన తీర్పు 

రచన::చెరుకు శైలజ

అమ్మ అంటు హడావుడిగా పిలుస్తూ వంటగదిలోకి వస్తున్న కూతురు వనజని, ఏమిటే అంతా గట్టి గా పిలుస్తున్నావు అంటు చేయి కొంగుతో తుడుచుకుంటూ కూతురికి ఎదురుగా వచ్చి అడిగింది విశాలాక్షి. నేను నిన్న కుట్టిన నా చీర కనబడడం లేదు. ఎక్కడ పోతుంది మంచిగా చూడు అంటూ కూతురితో పాటు హాల్లో రెండు గదుల్లో వెతికింది.నేను అసలు అక్కడ పెట్టేనే లేదు . ఈ హాల్లోఆ కిటికీ దగ్గర కూర్చుని కుట్టి
ఆ కిటికీ లోనే పెడుతున్నా రోజు అంది. మరి ఏమైపోతుందే. ఏమో? పొలం దగ్గర నుండి రాఘవరావు వచ్చి కాళ్ళు కడుక్కొంటు వీళ్ల హడావుడి చూసి ఏమైంది ?అని అడిగాడు. నాన్న నువ్వు ఏమైనా తీశావా? నేను రోజు కొంచెం చీర కుట్టుకుంటు ఈ కిటికిలో పెట్టుకుంటున్నాను. నువ్వు కూడ ఇక్కడ నీ కుర్చీలో కూర్చుంటావు కదా! లేదే వనజ నేను అసలు నీ చీరనే చూడలే, మరి ఏమైంతుంది అంటు ఆత్రుతతో వెతికినా చోటనే వెతుకుతుంది. తమ్ముడు రానివ్వె అడుగుదాం అంది . అమ్మ అన్నం పెట్టు ఆకలి అంటూ చెమటలతో కొడుకు గోపాల్. వచ్చాడు
ఊరులో పదవ తరగతి చదువుతున్నాడు. ముందు ఇది చెప్పారా ?ఇక్కడ కిటికిలో పెట్టిన చీర ఏమైనా తీశావా? వనజ అడిగింది. లేదక్కా తీయలేదు. నాకేం పని దానితో అంటు స్నానం చేయడానికి బాత్రూం లోకి వెళుతు అమ్మ నేను వచ్చే సరికి అన్నం వేడిగా పెట్టు అన్నాడు. అలాగే రా అంటు వంటఇంట్లోకి వెళ్లి అందరికి భోజన ఏర్పాట్లు చేసింది. ఎంతో బాగుండే ఆ చీర లేత పసుపు పచ్చ చీర పైన కృష్ణ రంగుతో నెమలిలు ఎంతో బాగా కుట్టుతుంది. దాదాపు పూర్తి కావచ్చింది. ఒకటే మిగిలింది ఎంతో మంచి కచ్చి వర్క్ కుట్టింది. ఏమైపోయి ఉంటుంది. ఆ ఆలోచనలు మదిలో మెదలుతువుండగానే ముగ్గురికి అన్నం పెట్టింది. నాకు అన్నం వద్దు.అలా అనుకుంటే ఎలా తిని మళ్ళీ అంతా ఒకసారి వెతుక్కుదాం అని కూతురిని బతిమాలాడి వాళ్లకు భోజనం పెట్టి తను తినింది.
విశాలాక్షి రాఘవరావు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు.
పెద్ద కూతురు పెళ్లి చేశారు. మేనరికమే ఇచ్చారు. రెండో కూతురు వనజ పదవతరగతి వరకు చదివి ప్రైవేట్గా డిగ్రీ చేసింది. తనకి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. అన్ని కుట్లు అల్లికలు బాగా వచ్చు. ఇప్పటికే ఎన్నో కుట్టింది. అక్కకి రెండు చీరెలు, తల్లికి కూడా రెండు చీరేలు కుట్టింది.
అక్క కూతురికి లంగా మీద కుట్టించింది
ఆ ఊరిలో ఆ కుట్టు అల్లికలు చూసి చాలా మంది మెచ్చుకున్నారు.అంతా బాగా కుడుతుంది. ఇప్పుడు కుట్టేది తన స్నేహితురాలికి కొరకే కుట్టుతుంది. ఊరిలో అన్ని రంగు దారాలు ఏమి దొరక్క నాన్న తో పక్క సిటీకి వెళ్లి అన్ని కొనుక్కొచ్చుకుంది. స్నేహీతురాలుది కుట్టే చీర కాబట్టి కపబడపోయేసరికి చాలా భయపడుతుంది వనజ.
ఆ ఊరిలో మధ్య తరగతి కుటుంబం రాఘవరావుది ఉన్న నాలుగు ఎకరాలు పొలం దున్ని పంటలు పండిస్తున్నారు. ఊరీలో ఏదైనా భూమి కొలతలు చూసేవాడు. ఉన్నంతలో ఊరులో మంచి పేరు పలుకుబడి తో జీవనం సాగిస్తున్నారు. ఊరిలో అందరు రాఘవరావు ఇంటికి మంచినీళ్లకి వస్తారు.ఆ బావి నీళ్లు తియ్యగా ఉంటాయి. ఆ బావి దగ్గర ఒక్కటే గోల సాయంత్రం నాలుగు గంటలైంది. ఒక్కోకరు నీళ్ళ బిందెలతో వస్తు నీళ్ళు నింపుకుని వెళ్ళు తున్నారు. ఆ మాటలు ఇక ఇకలు,పకపకలు సందడి మొదలైంది.
ఆ ఊరి కోడళ్ళు వాళ్ళ బిందెలతో వచ్చి నీళ్ళునింపుకోని పోతున్నారు. హాలు కిటికీ పక్కన నుండే ఒక సందు వుంటుంది దాని కనుకోని ఇంటి వెనుకలా ఒక బావి.
. రోజు కిటికీ దగ్గర కూర్చుని వారిని గమనిస్తూ తన చీర కుట్టుకునేదీ వనజ .
ఈ రోజు చిన్న పోయి దిగులుగా కూర్చోంది .ఏమే వనజ వెతికావా అంతా తల్లి అడిగింది. ఎన్నీ సార్లు వెతకాలి ఏడుపు ఒక్కటే తక్కువైంది. దానికే అంతా బాధ పడి ఏడుస్తున్నావా?. ఇంకోటి కుట్టుకో అంటు తమ్ముడు అక్క దగ్గర ఉన్న మంచంలో కూర్చుండిపోయాడు. నీకు ఏం తెలుసు ఎంతో ఇష్టంగా కష్టపడి కుట్టాను. అది నా స్నేహితురాలు పద్మ కోసం అంది. మరల కొని కుట్టి ఇయ్యాలి అంటే ఎంతో కష్టం తెలుసా. పైగా ఈ చీర చూసి నాకు ఇంకా ఎన్నో ఆర్డర్స్ ఇపిస్తా అంది.
వనజ బాధ పడకు, నేను ఈ ఊరిలో మంత్రం తెలిసిన సత్తయ్య ఉన్నాడు. ఆయనను తీసికొని వస్తా ఉండు అంటు రాఘవరావు బయటికి వెళ్లాడు. వీళ్ల ఇంటిలో పనిచేసే యాదమ్మ వచ్చింది. పొద్దున అంతాపని చేసి పోయింది మరల సాయంత్రం పనికి వచ్చింది .కాని దాని మీద అనుమానం లేదు చాలా మంచిది. ఎన్నో ఏండ్ల నుండి నమ్మ కంగాపనిచేస్తూ ఉన్న ది.
అయిన విశాలాక్షి ఏమే ఇక్కడ గూట్లో ఉన్న చీర ఏమైనా చూసిన వానే అడిగింది. నేను చూడలేదమ్మా చిన్నమ్మ కుట్టు కుంటు ఆ కిటికీ లోనే కదా పెట్టేది అంది. ఇప్పుడు కనబడుతలేదూ ఎక్కడో పోయింది అంతా చూసినం. ఏమో నమ్మ నేను తియ్యాలేదు. అంటు ఇంట్లో ఉన్న బిడ్డల మీద కొడుకు మీద ఒట్టుల మీద ఒట్టు పెట్టుకుంటు పని చేసి నా మీద నమ్మకం కుదరకపోతే మా ఇంట్లోకి వచ్చి చిన్న బాబుని చూడమని చెప్పండమ్మ అని చెప్పుకుంటు వెళ్లి పోయింది .
రాఘవరావు సత్తయ్యను వెంబడి పెట్టుకొని వచ్చాడు .ఆయన అంతా వివరం అడిగాడు. ఎక్కడ కూర్చుని కుట్టు కున్నది. ఎక్కడ పెట్టింది అంతా తెలుసు కున్నక, కిటికికి ఆనుకొని ఉన్న చిన్న సందు నుండి కొంచెం దూరం లో బావి ఆ పక్కనే కూరగాయల పూల చెట్లతో పెద్ద ఖాళీ స్థలం ఉన్నది. అప్పుడే ఒకరిద్దరు నీళ్ళు తీసుకొని వెళుతుండే అది చూసి
ఈ బావి దగ్గరకు అందరు వచ్చి మంచినీళ్లు తీసుకోని వెళుతారా అన్నాడు. అవును అని సమాధానం చెప్పాడు రాఘవరావు.
అయితే వాళ్ళ అందరిని ఒకసారి ఇక్కడకి పిలిపించండి అన్నాడు. దాదాపు ఒక ఇరవై మంది వరకు వుంటారు. తన పొలం లో పనిచేసే వీరయ్యను అందరిని ఇక్కడకి తీసుకొని రమ్మని చెప్పాడు. అలాగే అంటు వీరయ్య ఆ ఆడవాళ్ళను అందరిని వెంబడి పెట్టుకొని వచ్చాడు. ఆ వచ్చిన ఆడవాళ్ళ మొఖం లో ఏమైంది అని వాళ్ళ మొఖలలో ఒక భయం కనబడింది .అందరిని చూసి సత్తయ్య చూడండిడమ్మా, మీరు రోజు ఈ అయ్యగారి ఇంటి నుండే మంచినీళ్లు తీసుకొని పోతారు. నిన్న కూడా తీసుకోని పోయే ఉంటారు. ఈ భవంతిలో ఉన్న కిటికిలో ఉన్న కుట్టుతో ఉన్న చీర పోయింది. మీలో ఎవరైన చూశారా? ఎందుకంటే మీరు ఈ కిటికీ పక్కన నుండే బావి దగ్గర నీళ్ళకు వెళ్తారు. మీరు చూసే ఉంటారు. ఆ చీర అన్నాడు. మేము చూడలేదు అని అందరు ఒకసారి చెప్పారు. మీరు అలాగే చెప్పుతారు. ఆ కిటికీ నుండి చేయి దూరుతోంది ఏం కష్టం లేకుండా తీసుకోవచ్చు మరి ఎలాగూ పోతుంది. నేను మీ అందరికి మంత్రం వేసిన ఒక్కోక్క కట్టే పుల్ల ఇస్తాను. ఎవరైతే ఆ చీర దొంగ తనం చేశారో వాళ్ళ పుల్ల ఒక ఇంచు పెరుగుతుంది. అని అన్ని ఒకే సైజులో ఉన్న చిన్న కట్టెపుల్లలను తన నోరు దగ్గర పెట్టుకోని నోటితో ఏదో మంత్రం వేసినట్లు చదివి అందరిని వరుసగా నిలబడమని అందరి చేతిలో పెట్టాడు . సరిగ్గా రేపు మీరు నీళ్ళకు వచ్చే సమయంలోనే ఈ పుల్లను పట్టుకొని రండి అని చెప్పి వాళ్ళను పంపి వెళ్లి పోయాడు.అందరు వారి వారి పుల్లలను చూసుకుంటు మాట్లాడుకుంటు వెళుతున్నారు అందులో అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకొని కాపురానికి వచ్చిన ఒక అమ్మాయి దిగులుగా ఉంది. ఏమే ఏందే అంటున్నావు ?అని వాళ్ళు అడిగితే, ఏం లేదు అని చెప్పి ఇంటికి వెళ్ళింది. మనసు మనసులో లేదు ఏం చేయాలి తెల్లవారుజామున తన పుల్ల పెరిగిపోతుంది. ఆ చీర తీసింది నేనే కాబట్టి, నేను ఈ పుల్లను కొంచెం ఇరుస్తాను. అప్పుడు పెరిగిన నా పుల్లా అందరితో సమానం అవుతుందని, పుల్లను విరిచి పడుకుంది.
తెల్లవారింది. పొద్దున పూట వారి వారి పనులు చేసుకొని సాయంత్రానికి అందరు తన పుల్లలను పట్టుకొని రాఘవరావు ఇంటికి వెళ్ళారు.
రాఘవగారి ఇంటి వాకిలి ముందు , ఊరి వాళ్ళు, అందరు నిలబడ్డారు. ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో? సత్తయ్య అందరు నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పుతు అందరి పుల్లలు తీసుకుంటు వెళ్లి పోతున్నాడు. చివరన ఉన్న ఆమె తన పుల్లని వణుకుతున్న చేతులతో ఇచ్చింది. ఆ పుల్ల తేడాగా ఉంది. మిగితా అన్ని ఒకే తీరుగా ఉన్నాయి. ఆ పుల్ల విరిచినట్టుగా ఉంది .అన్ని పుల్లలను అందరికి చూపెట్టి ,ఆ తేడా ఉన్నా పుల్లను తీసుకొని ఆమెను పిలిచాడు.ఆమె వణుకుతు ముందుకు వచ్చింది . నువ్వే కదా ఆ చీర తీసింది అన్నాడు .ఆమె వణుకుతు తను దొరికి పోయినందుకు అవును అన్నట్టు తల ఊపింది . ఎందుకు చేశావు అంటు అడిగాడు. ఏడుస్తూ ఏం జవాబు చెప్పలేదు. మిగితా అందరు ఈ ఊరికి పెండ్లి చేసుకోని కొత్తగా వచ్చింది వదిలేయండి. చిన్న పిల్ల ఏం తెలియదు అన్నారు . అలా దొంగతనం చేయడం తప్పు కదా !వాళ్ళ ఇంటిలోనే మంచినీళ్లు తీసుకెళ్ళుతు వాళ్ళ ఇంట్లో నే దొంగతనం చేయడం అని కోపం గా అన్నాడు. అయ్యో క్షమించండి అంటు లేచి రాఘవరావుకి రెండు కాళ్ళకు దండం పెట్టింది. సరేలే జరిగిందేదో జరిగిపోయింది. ఈ సారి ఈలాంటిటి తప్పు చేయకు అన్నాడు. అంటానే అయ్య అంటు వేగంగా వెళ్లి ఆ చీరను తెచ్చి వనజకు ఇచ్చి దండం పెట్టింది. ఆ చీరను తీసుకొని వనజ ఎంతో అపురూపంగా చూసుకుంది. వెళ్లు ఇలా చేయకుడదు ఇంకోసారి అంది. అలాగే అంటు తలదించుకుని వెళ్లిపోయింది. అందరు సత్తయ్య తీర్పును అందరు మెచ్చుకుంటు వెళ్లి పోయారు.
మా అమ్మాయి చీర మాకు వచ్చేటట్టు చేసి తన కళ్ళల్లో సంతోషం నింపావు. ఎలా తెలుసుకోగలిగావు అని రాఘవరావు అడిగాడు. ఏం లేదయ్యా మంత్రం లేదు. ఏమి లేదు .ఉరికే మంత్రశక్తి అని భయపెట్టాను. వాళ్ళు నిజమని నమ్మి ఆ చీరతీసిన ఆమె భయంతోనే దొంగతనం చేసింది కనుక ఎక్కడ పెరూగుతుందో అనుకోని పుల్లని కొంచెం విరిచింది .అంతేనయ్య ఆ చీర దొంగను పట్టుకున్నాను అన్నాడు. ఎంత తెలివి అంటు సత్తయ్యను మెచ్చుకొని ఒక 500రూపాయలు బహుమతిగా ఇచ్చి నీవు ఇలాగే ఊరిలో ఉన్న వారిని నీ మంత్ర తెలివితో అందరికి న్యాయం చేయి. ఊరులో ఎవరు ఏ తప్పు చేయడానికైనా భయపడుతారు.ఆన్నాడు. నీ తెలివైన మంత్రంతో అందరిని మంచి వారుగా మార్చు
మీలాంటి పెద్దల దయ ఉంటే ఇంకేమి కావాలయ్యా అట్టనేనయ్య అంటు నమస్కారం చేసి సత్తెయ్యా సంతోషంగా వెళ్లి పోయాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!