వ్వాట్సాప్ సాయం 

వ్వాట్సాప్ సాయం 

రచన::లోడె రాములు

మనిషి చరిత్ర అంటే పుట్టుక నుంచి గిట్టుక దాకా మాత్రమే అని అనుకోవడానికి వీళ్లేదు.. కొన్ని సందర్భాల్లో మరణానంతర సంఘటనలు కూడా అతని చరిత్ర మీద సానుకూల, ప్రతికూల ప్రభావాలు చూపుతాయి.. బతికినన్నాళ్లు అనామకునిగా బతికినా, మరణించాక ప్రజల సానుభూతిని పొందుతారు..
ఈ రోజుల్లో భార్యా పిల్లలు, బంధుమిత్రులు ఎవ్వరైనా కడదాక, కనీసం కట్టెకాలేదాకా కూడా రావడం లేదు.
ఓ మంచి పనికోసం సంకుచితత్వం విడిచి అందరూ ఏకమై అంతిమంగా ఒక మంచి ఆశయాన్ని బతికించారు.
మాఊరి యువకులు.అందుకు వారిని అభినందిస్తూ.. ఈ మద్యే జరిగిన సంఘటనే ఈ కథ…
జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం..
ఈచక్రాన్ని ఎవరూతప్పించుకోలేరు.

“ఏమైంది రా.! అట్ల ఏడుస్తున్నావ్.”
“ఏంది బిడ్డా.. ఫోన్ చూసుకొని తల బాదుకుంటున్నావ్ ”
“అరేయ్.. ఎక్కడికి రా.. అట్లా ఊరుకుతున్నావ్..”
“ఏంటండీ.. ఒక్కసారిగా కళ్ళనీళ్ల పర్యాంతమయ్యారు..”
“ఏమొచ్చిందిరా.. నీకూ గుండె కొట్టుకుంటున్నావ్…”

జూన్ 26 జరిగిన హృదయ విదారక సంఘటన యువకులందరికి ప్రాణ స్నేహితుడు కొండ నరేష్ ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృత్యువాత పడ్డాడని అందరి ఫోన్ లలో వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన వార్తకు ఒక్కసారి ఊరిలోని ప్రతి ఇంట్లో యువకుడు.. ఊహించని ఈ వార్త కు దిగ్బ్రాంతి చెంది.. అందరూ నరేష్ ఇంటికి పరుగేత్తుకొస్తుంటే, ఊర్లోని జనం కూడా ఏదో జరిగి ఉంటుందని వారిని అనుసరించారు..

నలభై ఏళ్లక్రితం పొట్టచేత పట్టుకొని మా ఊరోచ్చారు కొండ మల్లయ్య దంపతులు.. కష్టపడటమే తప్ప కల్లాకపటం తెలియదు. గీత వృత్తిని నమ్ముకొని పిల్లల్ని చదివించి, పెళ్లిళ్లు చేసి, “ఎవరి బతుకులు వారు బతకండి ,ఆస్తులు సంపాదించలేక పోయాను.మీకు రెండు రెక్కలకు నాలుగు రెక్కలుచేశాను,మీ తెలివితోటి బతకండి బిడ్డా” అని వారిని ఓ ఇంటివారిని కూడా చేసి మనవళ్లు, మనవరాళ్లను చూసుకొంటూ శేష జీవితం గడుపుతున్న మల్లయ్య దంపతులకు. గుండెకోత ఎదురైంది తమ చిన్న కొడుకు కొండ నరేష్ (35)డిగ్రీ వరకు చదివి, ఊరి దగ్గర ఉన్న కెమికల్ కంపెనీ లో ఉద్యోగం, తనకు ఇద్దరు ఆడపిల్లలు, సంవత్సర క్రితమే ఇద్దరు మగపిల్లలు కవలలుగా జన్మించారు.అంతా సంతోషంగా జీవితం గడుస్తుంది..
నరేష్ కూడా డ్యూటీ, కుటుంబం తప్ప ఎలాంటి చెడు తిరుగుళ్లు, అలవాట్లు లేవు.. తనతో పాటు పనిచేసే వారందరితో చాలా స్నేహం గా,కలివిడిగా మేదులుతూ ఊర్లో మంచి పేరు తెచ్చుకున్న తనకు, “ఇంత చిన్న వయసులో గుండె పోటు రావడమేమిటి?” అని లోకం.
చావుకు దయా దక్షిణ్యాలు, చిన్నా పెద్ద తారతమ్యాలు ఉంటాయా..
దానిది సమ దృష్టి…
నరేష్ అంతిమ యాత్ర లో ఊరు ఊరంతా పాల్గొన్నది.. తనకు బంధుజనం ఎవరూ లేరు.. గ్రామ యువకులంతా తమ సొంతం కుటుంబ సభ్యున్ని కోల్పోయామన్న బాధతో ఉన్నారు.
కారణం ముక్కుపచ్చ లారని నలుగురు పిల్లలు.. అమాయకపు భార్య, ఎలాంటి ఆస్థి పాస్తులు లేవు.. రేపటి నుండి వీరి బతుకు దెరువు ఎవరూ… పిల్లలకు నాన్న చనిపోయాడన్నా విషయం కూడా అర్ధమయ్యే వయసు కాదు..
అంతిమయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు..ఎలా..! ఎలా..! ఏమైనా వారి కోసం చెయ్యాలని యువకుల మనసుల్లో బలంగా ఉంది.. ఆ రాత్రే అందరూ జమ అయ్యి, “ముందుగా మనమంతా మనకు చేతనైనంత డబ్బులు జమ చేసి, ఆ పిల్లల పేరు మీద ఫిక్స్ చేద్దాం “అని కొందరు..
“ఓకే.. అలాగే చేద్దాం..ఇంకా ఊర్లో పెద్దలను కూడా అడుగుదాం..”
“మనం సభ్యులుగా ఉన్న వ్వాట్సాప్ గ్రూపుల్లో ఈ మెసేజ్ పోస్ట్ చేద్దాం.. కొంత మంది స్పందించినా బాగుంటది కదా..”
ఇలా ఎవరికి వచ్చిన, తోచిన ఆలోచన వాళ్లు చెబుతున్నారు..
చివరికి అందరూ సూచించిన సలహాలను వెంటనే అమలు చేశారు..
తెల్లారి చూసే సరికి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో నరేష్ తన పిల్లలతో ఉన్న కుటుంబ సమేత ఫోటోను.. జరిగిన దారుణాన్ని తెలియజేస్తూ.. మీకు తోచిన సాయం చెయ్యండని.. గ్రామ యువకులంతా ముక్త కంఠం తో విజ్ఞప్తి చేశారు..
ఈ మెసేజ్ చుసిన వెంటనే ప్రతి ఒక్కరి మనసు కరిగింది. యువకులంతా ఉమ్మడిగా ఇచ్చిన ఫోన్ పే /గూగుల్ పే..నెంబర్ కు డబ్బులు పంపించడం మొదలు పెట్టారు.. వారు ఊహించిన దానికన్నా ఎక్కువగా స్పందన వచ్చే సరికి వారికి తృప్తి కల్గినది..
ఈ విషయాన్ని స్థానిక మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు
శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే మానవతా దృక్పధం తో రెండు లక్షలు పంపించారు..

మా ఊరి సర్పంచ్ శ్రీమతి ఆకుల సునీత శ్రీకాంత్. ఉపసర్పంచ్ శ్రీ గంగాపురం గంగాధర్.. ఢిల్లీ మాధవరెడ్డి, వారి పాలకవర్గం.. గ్రామ యువజన సంఘాలు, SSC బ్యాచ్ పూర్వ విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు, కులసంఘం పెద్దలు,ప్రేమతో పెద్ద మొత్తాన్ని ఇచ్చారు.ఇంకా కొంతమంది పేరు ప్రకటించుకోవడం ఇష్టం లేని వారు
నేరుగా నరేష్ ఇంటికి వెళ్లి డబ్బు, సరకులు, బియ్యం రూపకంగా ఇచ్చినవారూ ఉన్నారు..

పెద్ద మనసుతో శ్రీ సోమ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి నెలా రెండు వేల చొప్పున వాళ్ళు జీవితం లో నిలదొక్కు కునే వరకు సాయం అందిస్తానని, మరో యువ నాయకుడు శ్రీ బీమిడి ప్రదీప్ జీ ఒక పాపకు ఐదవ తరగతి వరకు విద్యా ఖర్చులు భరిస్తానని ముందుకు వచ్చి నరేష్ కుటుంబానికి భరోసా ఇచ్చారు..
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గ్రామ యువకులు
శ్రీ ఉప్పు కృష్ణ, పల్చ దశరథ, ఢిల్లీ
చేవెళ్లి శివ కృష్ణ., ఉప్పు చిన్న కృష్ణ,
ఎర్ర విక్రమ్,ఢిల్లీ నాగార్జున రెడ్డి, పిట్టల శ్రీను,పల్చ శ్రీకాంత్., బాతరాజు ధనంజయ, రాజు, ఆకుల మధు, రాజు.. ఇంకా ఎందరో యువకులు.. వారందరిని
అభినందిస్తున్నాను..

నరేష్ కుటుంబానికి ఇంతగా అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు..
ధన్యవాదాలు తెలియజేశారు..
నరేష్ అన్న గారు కొండ మురళి..

***

 

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!