ఓ అడవికాచిన వెన్నెలా ….!!

ఓ అడవికాచిన వెన్నెలా ….!!

రచయిత: వడ్డాది రవికాంత్ శర్మ

నడుస్తున్నాను నడుస్తున్నాను ……/
మానవ సమూహం విదిల్చే వేడి గాలులని వదిలి ../
ఎర్రటి భానుని భగ భగ లను భరించలేక …./
చల్లని నీడకోసం …../
చక్కని వెన్నెల కోసం …../
అలుపెరగని బాటసారిలా నడుస్తున్నాను …./

వనదేవత కరుణించింది …../
సుందరమైన స్వప్నాన్నిచ్చే …./
వింతనూ ఆశ్చర్యాన్నీ పంచే…../
మధ్యాహ్నపు నిద్రను బహుమతిగా ఇచ్చింది తన నీడలో …./

అందాల దీవిని మరిపించే వెన్నెలను రాతిరి కురిపించింది ../
ప్రకృతి ఆరాధనలో తన్మయుణ్ణయ్యాను…./
వనదేవత కరుణకు పాత్రున్నయ్యాను…../
బాటసారి కల ఫలించింది …./
అతని కళకు ఆదరణ దొరికింది …./

ఓ అడవికాచిన వెన్నెలా …../
చుట్టపు చూపులా అప్పుడప్పుడూ పలకరించు …./
జీవన సమరంలో ఏర్పడ్డ గాయాన్ని కరిగించు …/
నిత్యయవ్వన కవన సంద్రంలో నా మనసుని సేద తీర్చు ../

You May Also Like

5 thoughts on “ఓ అడవికాచిన వెన్నెలా ….!!

    1. ఎప్పుడు నూతనంగా అనిపించే పదాల సముద్రంలొ
      సేద తీరాలి అన్నారు…. అనిర్వచనీయమైన పోలిక
      అలలా అర్ధం అవ్వి అవ్వకుండా ఉంది భావన 👌🏻
      బాగుంది అండి!!!

  1. మీ అడవి కాచిన వెన్నెలా చాలా బాగుంది అండి… చాలా చక్కగా రాశారు 👌👌👌👌👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!