గురు(వే)దేవుడు

గురు(వే)దేవుడు

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

ఆషాడ మాసమే పుణ్యప్రదమై
పౌర్ణమి తిధియే అత్యంత పవిత్రమై
వ్యాసమహముని అందరి గురువై
ఆయన జన్మదినమే వేడుకయినది

కృష్ణద్వైపాయనుడుగా గురువుగా
వ్యాసమహామునిగా వ్యాసుడుగా
వేదమంత్ర శాస్త్రాన్ని విభజించెను
హిందూ సంస్కృతిని కాపాడెను

ఆద్యాత్మికతను చాటి చెప్పేను
మానావావాళి వారసత్వం పెంచెను
భక్తికి సంధానకర్త తానుగా నిలెచెను
వేదవ్యాసునిగా పురోగమించెను

మార్గ నిర్దేశకుడిగా వ్యాసుడు మారే
గురువుల పట్ల భక్తిని పెంపొందించి
ప్రజలను ముక్తి మార్గం వైపు నడిపి
పరమావధిని భక్తులకు తెలిపేను

ఆదర్శవంతమైన గురువే దైవంగా
ఆత్మీయతను పంచిచ్చే సద్గురువే
ఆపదలో దాటించే నారాయణుడు
స్మరణకే ఆనందుడగు గురువొక్కడే

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!