మళ్లీ అక్కడికే

మళ్లీ అక్కడికే

రచన:: అమూల్య చందు

ఆనందాల్ని
ఆండ్రాయిడ్లకు
తాకట్టు పెట్టి
బంధాల్ని
ల్యాప్ టాపులకు
బలి ఇస్తూ
ఈ ప్రపంచాన్ని
ముందుకు
తీసుకెళుతున్నట్టు
భ్రమిస్తున్నాడు…

మతి చలించి
మనసు మందగించి
జీవం పోసే
చెట్లను నరికి
ప్రాణం పోసే
నదులను అణచి
ప్రకృతి గుండెకొండను
తొలిచి
చీకటి గుహల్లోకి మళ్లీ
ఆదిమానవుడిగా
చాప కింద నీరులా
మరలిపోతున్నాడు..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!