చీకటి మాటున పువ్వుల హారం

(అంశం::”ఆ చీకటి వెనకాల”)

చీకటి మాటున పువ్వుల హారం

రచయిత :: పి. వి. యన్. కృష్ణవేణి

హాయ్, నేను రాజీవ్. అందరిలాగా ఎదో అయ్యింది అనిపించుకుని, వెళ్ళిపోయే రకం కాదు నేను. ముందు నాతో చనువు పెంచుకున్న తర్వాత మాత్రమే నువ్వు నాకు కావాలి అన్నాడు.

నేను మాత్రం పేలవంగా ఒక చిన్నపాటి నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఏది ఏమైనా, ఒక రెండు గంటలు, అది కూడా భయం భయంగా చుట్టూ చూస్తూ ఎదో గడుపుకుంటారు. అనేది నా నవ్వు అర్థం.

కానీ, మా నవ్వుల్లో అర్దం కంటే అందాన్ని వెతుక్కున్నాడు అందరి లాగానే తనకి తాను గొప్ప
అనుకునే రాజీవ్.

ఇంకా పొగడ్తల వర్షం మొదలు పెట్టాడు.

హే, మణి …..నీ నవ్వు నిజం గా అద్భుతంగా ఉంది. చెపితే నమ్మవు గానీ , నీ చంద్రబింబం లాంటి  ముఖంలో కళ అద్భుతం. శరీర భాగాలు ఎక్కడివి అక్కడ ఎవరో అమర్చినట్టుగా చాలా చక్కగా ఉన్నాయి అదీ సరి అయిన కొలతలతో… నీకు ఇది ఎలా సాధ్యమయ్యింది అంటూ నా ఒళ్లు అంతా తన కళ్లతో తడిమేస్తున్నాడు.

ఆ చూపులు, చేష్టలు నాకు కొత్త కాదు కదా!!!! అందుకే, నేను అవి ఏమి పట్టించుకోకుండా, మామూలుగా నుంచున్నాను.

నా వైఫ్ కి నాకు మద్య గొడవలు అందుకే ఇలా… కానీ నాకు మాత్రం తనతో విడీపోవటం ఇష్టం లేదు. తను మాత్రం నేను అంటే ఇష్టంగా లేదు. నా ఫ్రెండ్సు సలహా ఇచ్చారు. నువ్వు దారి తప్పుతున్నావు అని తెలిస్తే, తను దారిలోకి వస్తుంది అని. అందుకే, తప్పని తెలిసినా, ఇక్కడకి వచ్చాను అన్నాడు.

కానీ నన్ను గాడంగా ప్రేమించిన వాడే, పెళ్లి పేరుతో నన్ను వంచన చేసి, నన్ను ఈ ఊబిలో దింపి, తన దారి తాను చూసుకున్న మహానుభావుడు నన్ను కట్టుకున్న వాడు.

నేను ఆలోచనలో ఉంటే, ఏదైనా చెపుతానేమో అని నన్నే చూస్తూ ఉన్నాడు రాజీవ్. కానీ నాకు మనుష్యల మీద నమ్మకం పోయి చాలా కాలం అయ్యింది. నేను ఎవరితో ఏమి పంచుకో దలచుకో లేదు.

చుట్టూ చీకటిలో తన చేతిలో ఉన్న పువ్వులు హారం నా మెడలో వేసి, తను మాత్రం ఆనందంలో తేలుతున్నాడు. ఒక అరగంట ప్రయాస తర్వాత, నేను బయటపడ్డాను.

మేడమ్, ఈ ఒక్కరోజు ఇంకో కేసు ని హ్యాండల్ చెయ్యలేను మేడమ్… ప్లీజ్ నాకు ఆరోగ్యం బాగాలేదు. అంటూ వేడుకున్నా, కనికరించని ఆ మహ తల్లీ… నువ్వు ఎమైనా సంసారం చేస్తున్నావా? నీకు ఇష్టం వచ్చిన రీతిలో
జరగాటానికి?

నేను నీ మీద పెట్టిన డబ్బులే ఇంకా వసూలు అవ్వలేదు. అప్పుడే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. అంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది.

నా భాధ ను పంచుకునే వాళ్లు లేక, కనీసం అర్థం చేసుకునే వాళ్ళు లేకుండా ఉన్న నేను ఓపిక తెచ్చుకుని మరీ చీకటిలో ఇంకో పూల హారం వేయించు కొవటానికి రెడీ అయ్యాను.

అంటూ ఏడుస్తూ తను పడిన అప్పటి కష్టాన్ని అంతా ఒక కథలా ముగించింది.  తెలివిగా ఆ ఊబి నుంచి బయటపడి, ఒక రెస్టారెంటులో వెయిటర్ గా  మారిన ఇప్పటి మణి….

నాదైన పందాలో నేను వ్రాస్తున్నాను .. ఆ పడతి యొక్క కష్టాన్ని నా పత్రిక కోసం… అదే నా వృత్తి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!