ప్రేమ శాశ్వతమా 

(అంశం::”చిత్రం భలారే విచిత్రం”)

ప్రేమ శాశ్వతమా 

రచన:: జయ

మది లోని ఆశలకు ఊహలు రెక్కలు తొడిగి
కనులు కనే కలలనే కుంచెగా మార్చి
హరివిల్లు లోని రంగుల్ని అద్ది.
అందమైన చిత్రం గా మలచి
నా ప్రేమ జగతి లోకి స్వేచ్ఛగా వదలడం చిత్రం కదా.!

అది నెరవేరని రోజు.
ఆ కలలు కన్న కనులే కారు మేఘలై
అశ్రుధారలుగా మారి ఆ చిత్రం లోని
రంగులన్ని కాలగర్భంలో కలిసిపోతుంటే
చూసి ఏడవటం విచిత్రమే కదా.!

ఈ లోకమంతా రేయి పగలు తేడా లేక
డబ్బు వెనుక పరుగులు తీస్తుంటే.
కొందరు పిచ్చివాళ్లు మటికి
ప్రేమ ,జాలి,దయ అంటూ తిరిగి
అపనిందలు పాలవ్వడం చిత్రమే కదా.!

ఆరడగుల మనిషే శాశ్వతం కాని ఈ సృష్టిలో
గుప్పెడు గుండె కోరుకునే ప్రేమ శాశ్వతం
అనుకోవడం చిత్రమే కదా.!

ఈ చిత్రాలు అన్ని సృష్టించి
పైనుంచి వేడుక చూస్తున్న.
ఆ చిత్రాల దేవుడు చేసే చిత్రాలు అన్ని.
చిత్రం భలారే విచిత్రం కదా.!

***

You May Also Like

2 thoughts on “ప్రేమ శాశ్వతమా 

  1. ఆరడుగుల మనిషి జీవితం శాశ్వతం కాదు అని చాల గోప్పగా చెప్పారు జయగారు …👏👏👏👏👏👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!