మనసులో మాట.

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

మనసులో మాట

రచన: జీ వీ నాయుడు

” మమ్మీ.. అన్నయ్య కు మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు. వాడికి 25 ఇయర్స్ వచ్చాయి కదా.. ” అని తల్లి రాధిక ను అడిగింది కూతురు మౌని ఉదయం కాలేజీ కీ రెడీ అవుతూ. ” మా బాధ కూడా అదే అమ్ములు. ఇప్పటికి ఇరవై సంబంధాలు చూసాము. ఒకటి అయినా నచ్చాడా..?. ఒక పిల్ల కీ పొట్టి జుట్టు వద్దు అన్నాడు. మరో పిల్ల కు ముక్కు లావట. ఇంకో దానికి కలర్ లెస్ అట. ఇలా ప్రతి దానికి ఏదో ఓ వంక చూపడం. వద్దు అనడం. ” అంటూ చెబుతుంది రాధిక.” ఎక్కడో ఒక చోట కంప్రమైస్ కావలి. నేను చూడు, మీ డాడీ విషయం లో ఒక్క మాట మాట్లాడితే ఒట్టు.. బాన కడుపు. బొగ్గుకన్నా బ్లాక్. అయినా ఒప్పు కాలేదా ” అంటూ తన గురించి చెప్పింది రాధిక కూతురికి.
” ఏమో లో మమ్మి.. బాన కడుపు అయితే నష్టం ఏముంది ” అంటూ అమాయకంగా అడిగింది మౌని, తల్లి రాధిక ను.
” నీకు తెలియదు లే… నీకు బాన కడుపు మొగుడు వస్తే అర్ధం అవుతుంది.. ” అని ఏదో చెప్పబోయి అర్ధాంతరంగా ఆపింది తల్లి.
” అవును, మమ్మీ బాన కడుపు వల్ల డిసడ్వాంటేజస్ ఏమి ఉన్నాయి ” అని చిలిపి గా నవ్వుతు అడిగింది మౌని తన తల్లిని.
” అబ్బా, నీకు ఎలా చెప్పాలి… కడుపు ఇంత పెద్దదిగా ఉంటే… మంచం తాకితే చాలు… అంతే గురకలు పెట్టి నిద్రపో తారు. ఇక పెళ్ళాం బాధ ఆయనకు ఏమీ తెలుస్తుంది. ఓ ముద్ధు లేదు, ముచ్చట లేదు.. అంతా నా ఖర్మ..” అంటూ తల్లి చెబుతుంటే మౌని నవ్వి నవ్వి కింద పడిపోయింది. దానికి తోడు ఈ మధ్య ఈ మొబైల్ ఫోను వచ్చాక, ఈయర్ సెట్ వాడి మొత్తం చెవుడు వచ్చింది మీ డాడికి. ఉదయం ఏమీ జరిగిందో తెలుసా.
” మన ఎదురింటి స్వప్న దగ్గరకు వెళ్లి ఒక 500 కీ చేంజ్ తీసుకుని రండి అన్నాను. అంతే ఆ అమ్మాయి దగ్గర కు వెళ్లి వాళ్ళ ఆయన ముందే చెయ్యి పట్టుకొని ” నిన్ను మా ఆవిడ చెయ్యి పట్టుకుని లాక్కొని రమ్మంది ” అని చెయ్యి పట్టుకున్నాడట మీ డాడీ. ఇంకేముంది. వాళ్ళ ఆయన వచ్చి మీ డాడీని చెంప చెల్లు మనిపించి చీవాట్లు పెట్టాడట. ఇంత చెవుడు వచ్చింది మీ డాడీకి.” అని చెప్పింది తల్లి. మౌనికి అసలు ఆ నవ్వు ఆపుకోలేక సోఫ నుండి కింద పడిందీ.
” సరే మమ్మి, ఇంతకీ అన్న మ్యారేజ్… ” అని మౌనిక చెప్పబో్తుండగా తల్లి కలుగజేసుకుంది
” వాడు ఏమో నాకు అసలు అర్ధం కావడం లేదు. అన్ని తుంటరి ఆలోచనలు ” అని బదులిచ్చింది.
అదేంటి అలా అంటావు అన్నది మౌనిక.
” వాడు చేసుకునే పిల్ల కు ఏ బి సి డి ఇ ఎఫ్…. జడ్.. ఆలా అన్ని గుణాలు ఉండాలి ఆట. మరి ఇవి తుంటరి ఆలోచన కాక.. ఇంకేమిటి. అసలే అమ్మాయిలు దొరకడం గగనం అయింది. ఏమో. వీడు అసలు అర్ధం కావడం లేదు. నువ్వే చెప్పుకో.. మీ అన్నకి.. తుంటరి ఆలోచన మాని మమ్మి చెప్పినట్లు విను ” అని చెప్పు అంది తల్లీ.
” అన్నా.. నీకు ఓ విషయం చెప్పనా.. నువ్వు తుంటరి ఆలోచన మాని మమ్మి చెప్పినవారిని మ్యారేజ్ చేసుకో ” అన్నది చెల్లి.
” నువ్వు ఒకటి చెప్పు. వాడు చందును ఇష్టపడ్డాడట. ఓకే చేయండి ” అని చెప్పాడు మౌనిక అన్న రైన.
అంతే తల్లీ కూతురు,, కొడుకు ఒక రోజు చర్చ పెట్రారు. తన మనసులో మాట చెప్పడం తో చందూతో రైన వివాహం ఫిక్స్ అయింది. ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలుపడం తో అట్టహాసంగా వివాహం ముగిసింది.
………

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!