అంజలి సరదగా కాసేపు మీతో

అంజలి సరదగా కాసేపు మీతో
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన :పుష్పాంజలి

కరోనా వలన లాక్ డౌన్ కాలేజ్ లు బంద్.ఇకా చూడు అత్తయ్య ఇల్లు శరణ్యం అంజలికి .

టీవి సిరియల్స్ లేకుండా మగువలంతా ఏడుస్తుంటే మగవారు ఇంట్లో వుండానికి ఏడుస్తుంటే అంజలి ఏమో కరోనా దెబ్బకు చేతులు కడిగి చేతుల్లో రేఖలన్ని మాయమైయి పొతున్నాయి కదా ! అని  ఏడుస్తుంటే

కరోనా ఏమో నేను నీ దగ్గరకు రాను లే కాని  రోడ్లు మీదా తిరుగుతున్నా వారి దగ్గరకు వెళ్ళతాను కదా! అంది

నాకు ఒక సందేహం ఉదయం 6నుండి 11వరుకు బజారులు గుంపులు గుంపులుగా జనం ట్రాఫిక్   అప్పుడు కరోనా నిద్రపొతుందా అని పెద్ద సందేహం పీడిస్తుంది………

అంజలికి 2020లో మంచి యోగం అన్నారు ఎమిటో అనుకున్నా నాకు ఈ విధమైన యోగం అని ఇప్పుడు అర్థం అయింది. ఒ కరోనా నీవ్వు అయిన శాన్ టెంజర్స్ కి ,డెట్టాలకు సొప్ కు, హ్యాండ్ వాస్ లకు బయపడుతున్నావు. ఈ ట్రాఫిక్ భూతం మాత్రము కొంచెం మోడి మాటలకు ప్రాముఖ్యత ఇచ్చినట్లు వుంది. గుడ్డి కన్నా మెల్ల బెటర్ అంటే ఇది ఏమో కదా………

పైన తథాస్తు దేవతలు వుంటారు అంటారు దీన్ని చూస్తే నమ్మక తప్పాదు  కాసేపు సరదాగా కరోనా సమయంలో రాసిన రచన ఇది ……..

1. పిల్లలు: స్కూల్ లేకుపొతే బాగున్ను అనుకుంటారు పైన తథాస్తు…

2. గృహిణి : మా ఆయన ఆఫీసుకు వెళ్ళకుండా నాతోనా ఉంటే బాగుంటుంది కదా పైన తథాస్తు….

3. మగవారు:దీనమ్మ జీవితం ఈ ట్రాపక్ లో ఆఫీసుకు ఎవడు వెళ్ళతాడు వర్కు ప్రెమ్ హోమ్ ఉంటే బాగుంటుంది కదా పైన తథాస్తు……

4. ఆడవారు:నా భర్త నా పిల్లలు  నాతో ఎక్కువ సమయం గడిపితే బాగుంటుంది కదా పైన తథాస్తు….

5- విథ్యార్దులు : ఈ పరీక్షలు లేకుంటే బాగున్నా కదా చదవలేక చస్తున్నం
పైన తథాస్తు……

6.వృద్ధులు :మా పిల్లలు మాతో ఎక్కువ సమయం గడిపితే బాగుండు కదా పైన తథాస్తు…..

7.కార్మికులు :అబ్బ ఈ పనిచేసి చేసి చచ్చిపొతున్నాం కాస్త విశ్రాంతి దొరకితే బాగుండు కదా పైన తథాస్తు….

8.కంపెనీయజమానులు : ఇంతాకాలం పనిచేయిస్తున్నా నాకోసం అని కొంచెం సమయం కేటాయించి కుంటే బాగున్న కదా పైన తథాస్తు……

9. పశువులు పక్షలు  :  ఈ మనుషులు ఎడా పడితే ఐలా
తిరుగుతున్నారు వీరిని ఎవ్వరైనా ఆపితే బాగున్నా కదా పైన తథాస్తు…….

10 జంతుశాలలోని జంతువులు :ఈ మనుషులను కూడా మాలా కొన్నిరోజులు ఇంట్లో నుండి బయటకి రాకుండా బందిగా వుంచితే బాగున్నా కదా .పైన తథాస్తు………

11. భూదేవి:  శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా వుంది ఈ  ట్రాఫిక్ పొల్యూషన్ తో  వీరిని ఎవ్వరైనా ఆపితే బాగుంటుంది కదా పైన తథాస్తు…

కొసమెరుపు :ఇలా మనవాళ్ళా కోరిక వలన అందువలన ఈ కరోనా  వచ్చి వెళ్ళింది
ఏమో…అనుకుంటాన్నాను.. నేను అయితే మరి మీరు పాఠకులారా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!