నువ్వే.. నువ్వే

నువ్వే.. నువ్వే
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఎన్. రాజేష్

నేనెక్కడ చూసిన నువ్వే
నేనెక్కడ తలచిన నువ్వే
నీ నవ్వు – చిరు నవ్వే
నువ్వు నీ నవ్వుతో నన్ను
ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను
నీ మక్కువలో పడవేసినావు

నీ అనురాగంతో నన్ను
మురిపించినావు
నీ అందమైన మోముతో
నన్ను మైమరిపించినావు.

నా మానస మందిర
మందు నా దేవిగా
నీవు వెలుగొంద నా రాణిగా
మమతల మాలలనల్లి
నే వేయుదు నీ గళ మందు
ఆజన్మాంతం నీకు వరుడిగా

ఓ చెలీ నీ చల్లని చిరునవ్వు
విరబూసిన జాజిమల్లెపువ్వు
నా యెదలో వెలసితివి నువ్వు
నిను నే కొలిచెద వరమివ్వు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!