ఇంతేనా ఈలోకం?!

ఇంతేనా ఈలోకం?!

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

చూడు చూడు ఈ లోకం
ఎంత కుళ్ళికంపుకొడుతుందో?
కుట్రలు కుతంత్రాలతో నిండిపియింది
అన్యాయ అక్రమాలతో అట్టుడికిపోతోంది
అత్యాచారాలకు అంతేలేదు
ఆకలిచావులకు ఆపేవారేలేరు
ఆత్మహత్యలకు అడ్డేలేదు
అనాధలకు ఆదుకునేవారేరి
ఎవరికెవరు ఏమికారు
ఎవరూ నీతోడురారు
ఒంటరిగానే నువ్వు మిగిలిపోతావు
ఒంటరిగానే నువ్వుపోతావు
ధనం నీకున్నా లేకపోయినా
దయాదాక్షిణ్యాలు కరవే
జాలి కరుణ కనపడవు
జనారణ్యంలో జంతువులే అందరూ
ఇంతేనా ఈ లోకం?!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!