సంపత్కారకుడు శివుడు

సంపత్కారకుడు శివుడు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
అయ్యలసోమయాజుల ప్రసాద్

సృష్టి, స్థితి, లయ కర్తలయిన త్రిమూర్తులలో శివుడు లయకారకుడు
శివాజ్ఞ లేనిదే చీమ ఆయిన కుట్టదు.
మార్కండేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించిన ప్రాణప్రదాత
అడిగిన వెంటనే వరాలు ఇచ్చే మహానుభావుడు…..!!

ప్రమద గణాలచే నిత్యం ఆరాధింప బడే మహిమాన్వితుడు.
గ్రహాలన్ని శివుని ఆధీనంలో ఉంటాయి అందుకే శివారాధన అత్యంత శ్రేయస్కరం.
నమః శంభవేచ మయోభవేచ, నమః శంకరాయచ మయస్కరాయచ నమఃశివాయచ శివతరయాచ అని
నారికేళ జలంతో శివుని అభిషేకం సర్వ శుభకరం…!!

సగరపుత్రుల సద్గతికై భగీరథుని తపస్సుమెచ్చి
పరమ పవిత్రమైన గంగ ను మనకందించిన లోకోద్దారకుడు
మోక్షానికి కారణమైన తారకమంత్రం
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
మనకందించి మానవ జీవితాలను ఉద్ధరించిన పరమాత్ముడు….!!

ఆదిశంకరులకు చండాలుని రూపంలో దర్శనమిచ్చి,
అహంకారాన్ని పోగొట్టి కులమత భేదాలు లేవని
జీవులందరు పరమాత్మ స్వరూపాలే అని
ఆత్మజ్ఞానాన్ని,అమరత్వాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తి.
ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రమే పాపాలను పారద్రోలు
లోక కళ్యాణార్ధం హాలహలంను గరళంలోనే ఉంచుకొన్న కారుణ్యమూర్తి
ఎన్నని చెప్పను, ఏమని చెప్పను శివలీలలు వర్ణింప తరమా?
అందుకే జగతిన శివుడు సంపత్కారకుడు…..!!
లోకా సమస్తా సుఖినో భవంతు.
…………..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!