స్నేహ పరిమళం

స్నేహ పరిమళం

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రాధ ఓడూరి

నా మనసు పూదోటలో విరిసిన స్నేహమా!
దేహలు వేరయినా
నీ తలపులు నా హృదయాన్ని తాకి
నా మదిలోని జ్ఞాపకాల పూదోటని నిద్ర లేపాయి
నిను చూసిన క్షణం నా మనసు నిను తలచెను
నీ పలుకులు నా హృదయాన్ని తాకి
నేను మౌనంగా ఉన్నప్పుడు
నీ రూపం మదిలో మెదిలెను
నా మనసు పూదోటలో విరిసిన స్నేహమా!
కష్టసుఖాలను తెలుసుకున్న స్నేహమా!
నా మనసు నీకై ద్రవిస్తోంది
మన స్నేహ పరిమళం అపురూపమని చెబుతూ
స్నేహబంధం స్నేహ గీతం పాడుతోంది
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతమని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!