స్వేచ్ఛ కేతనం ఎగిరేద్దాం

(అంశం:”బానిససంకెళ్లు”)

స్వేచ్ఛ కేతనం ఎగిరేద్దాం

రచన: వనపర్తి గంగాధర్

బానిస సంకెళ్ళ రుచి తెలిసిన వాళ్ళం
అప్రతిహతంగా సుదీర్ఘకాలం
బ్రిటిష్ వారి నిరంకుశత్వానికి
దోపిడీ తత్వానికి నిదర్శనం మన దేశం
బానిసత్వం ఎంత బాధాకరమో
భరించి అనుభవించినవాళ్ళం
అందరమొకటై బానిసత్వాన్ని తరిమినవాళ్ళం
దేశం మరవని అదో బానిస ఘట్టం

మళ్లీ నిజాం బానిస పరిపాలన
మరచిపోని హింసా బానిసత్వం
తరతరాలకు తరగని వేధనాతత్వం
మళ్లీ పోరాటం బానిసత్వాన్ని
చంపే స్వేచ్ఛా అహింసా పోరాటం
అప్పుడు ఎప్పుడు విజయం మనదే
మనందరం స్వేచ్ఛా విహంగాలమై
విజయ కేతనం ఎగరేశామ్
బానిస సంకెళ్లు కాదు శాశ్వతం
మన సత్య పోరాటమే మనకు రక్ష

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!