అవని రక్ష

అవని రక్ష

రచన: వనపర్తి గంగాధర్

అవనికి రక్షా కవచం ఓజోన్
సకల జీవులకు ప్రాణ ప్రదాత
ఆరోగ్యాలను కాపాడే ఛత్రము
మానవ జాతి మనుగడకు ఆధారం

రోజురోజుకు పెరుగుతున్న భూతాపం
భూమాతను మనందరం కాపాడుదాం
అవనిపై కాలుష్యాన్ని తగ్గిద్దాం
యంత్రాల వ్యర్థ వాయువులకు ఆపేద్దాం
విష వాయువుల ఉత్పత్తి నిలిపేద్దాం
మన భవిష్యత్తును కాపాడుకుందాం

పెరుగుతున్న కాలుష్యం ఆకాశానికి
చేస్తుంది చిల్లుల గాయం
కరుగుతుంది ఓజోన్ పొర
అతినీలలోహిత కిరణాల సెగ
తట్టుకోలేవు భూమి మీది జీవాలు
అందుకే పరిరక్షిద్దాం ఓజోన్

ప్రకృతి సమతుల్యతను కాపాడాలంటే
వనాలను పెంచుదాం విరివిగా
చెట్లను కాపాడుదాం నిండుగా
కాలుష్యాన్ని నివారిద్దాం మెండుగా
అప్పుడే మనందరం జీవిస్తాం ఆనందంగా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!