సమయస్ఫూర్తి

సమయస్ఫూర్తి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: VT రాజగోపాలన్

డాక్టరు..డాక్టరూఅంటూ”పరుగెడుతూ వచ్చాడు చంద్రం”. ఏం చంద్రం? “గుండె కొట్టుకోవడంలేదు.. అన్నాడు గసపోస్తూ” అరెరే ఇలా దగ్గరకి రా..రా కొంచెం కూర్చో.. స్టెతస్కోప్ పెట్టి చూస్తే, “లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ” వేగంగా. “ఏం చంద్రం ఇంత వేగంగా కొట్టుకుంటుంటే లేదంటావు.” “అరే నాక్కాదులే డాక్టర్, మా నాయనమ్మకు” అమ్మ తీసుకురమ్మంది నిన్ను. “రా త్వరగా వెళతాం, అంటూ చేయిపట్టుకొని వడి వడిగా ఇంటికి వచ్చాడు”. ఒరేయ్ చంద్రూ డాక్టరు ఏడరా అని ఇంట్లోవాళ్ళు అడిగితే, బయట ఉన్నారు చూడు. బయటకు వచ్చి చూస్తే ఒక అందమైన అమ్మాయి గడప దగ్గర నిలుచోనుంది. ఎవరమ్మా నీవు, ఏమి కావాలి, అని అడిగారు. ఇదిగో హారతి నీళ్లు తీసుకురండి అప్పుడే లోనికి వస్తాను. “మీ అబ్బాయి నా చేయి పట్టుకొని ఏడడుగులు నడిచాడు” అడగండి మీ అబ్బాయిని. అంతే ముసలావిడ ఎవతే అది, మా చంద్రం గురించి ఇలా చెప్పింది అంటూ చేతికర్ర తీసుకొని, లేచి, ఆ అమ్మాయి వైపు వస్తుంది. అది చూసిన అమ్మాయి ఒకటే నవ్వు, ఆశ్చర్యం, ముసలావిడ లేవడం, అందరూ అమ్మాయితో పాటు “నవ్వులే నవ్వులు.”ముసలావిడకు మాత్రం ఏం జరిగిందో అర్ధం కాలే, ఎందుకు వీళ్ళు నవ్వుతున్నారని అడిగితే, అసలు విషయం చెబుతారు. “చంద్రం పెళ్ళి అంటే నీ ఆరోగ్యం కుదుటపడుతుంది అని, ఆ అమ్మాయి అలా చెప్పింది అంతే అని వెనకే నవ్వుతూ వచ్చిన డాక్టరుగారు, అమ్మాయి కొత్తగా చేరిన నర్సు అని చెబుతూ, ఇపుడు ఇక మీకు ఏ విధమైన అనారోగ్యం లేదు అని చెబుతాడు. ‘ఆ మాటలు విని బామ్మ ముసి ముసి నవ్వుకుంది’.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!