ముగ్గురు వీరులు

(అంశం: చందమామ కథలు)

ముగ్గురు వీరులు

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

అనంతపురం రాజ్యానికి అనంతవర్మ పరిపాలన చేస్తున్నాడు.అతని మంత్రి విక్రమవర్మ,సేనాధిపతి
శూరవర్మ కూడా అతనికి పరిపాలనలో సహకరిస్తుంటారు.ఆ రాజ్యంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఎల్లప్పుడు వుండేలా చూసుకుంటుంటారు.వారు ముగ్గరు హోదాలు వేరైనా ఒకనాడు మంచిమిత్రులుగా ఉండేవారు.అదే పరంపరను కొనసాగిస్తున్నారు.వారి ముగ్గురికి
ముచ్చటగా అతిలోక సౌందర్యవతులైన కుమార్తెలు ఒకొక్కరున్నారు.వాళ్ళపేర్లుకూడా కళ్యాణి ,కాంచన,కరుణ.కళ్యాణి రాజుగారి కూతురు
కాంచన మంత్రిగారి కూతురు కరుణ సేనాధిపతి కూతురు.వాళ్ళ తండ్రులులాగే వీరు ముగ్గురు ప్రాణస్నేహితులు.ఒకరిని విడచి ఒకరు వుండలేరు.
వారు చాలా అల్లారుముద్దుగా పెరిగారు.వాళ్ళు ఎప్పుడు సుఖసంతోషాలతో వుండాలని తమలాగే
వాళ్ళకి అన్యోన్యంగావుండే అన్నదమ్ముల్లాంటి వారిని
వెదకి పెళ్ళిళ్ళుచేసి తమ రాజ్యంలోనే  ఉండేలా వారికి
ఉన్నతపదవులు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు.అందుకు తగిన వారిని వెదకమని విప్రులను నియమించారు.
ఒకనాడు స్నేహితురాళ్ళు ముగ్గరు వనవిహారంచేస్తున్నారు.కొందరు ముసుగుమనుషులు
వారిపైదాడిచేయబొతుండగా మరోముగ్గురు యువకులు వారితో తలపడి ముగ్గురు స్నేహితురాళ్ళను రక్షించారు.వారు కూడా అందమైన
యువకులే.ఈలోగా రాజుగారి సైనికులు వచ్చి జరిగింది తెలుసుకొని ఆ ముగ్గరు యువకులను
రాజుగారిదగ్గరకు తీసుకొనివెళ్ళారు.రాజు మంత్రి సేనాధిపతి తమ కుమార్తెలద్వారా జరిగింది తెలుసుకొన్నారు.ఆ యువకులవివరాలు తెలుసుకొని
వారికి తమ కుమార్తెలతో వివాహంజరిపించి తమరాజ్యంలోనే ఉన్నతపదవులను ఇచ్చారు.
అందరూ సుఖసంతోషాలతో కాలంగడపసాగారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!