కసాయి తల్లి

కసాయి తల్లి

రచన: చిరునవ్వు Rj రాల్స్

యే తప్పు చేసానో అని అమాయకపు చూపులతో సమాధానమిచ్చి కళ్ళుమూసాడు. మెడ నుండి పారుతున్న రక్తపుసంద్రం పాదాలను కడుగుతుంటే తల్లి జన్మ సిగ్గుపడింది.

ఐదు సంవత్సరాల ధరుడు అమ్మ చెప్పిన వస్తువు కొనుక్కురావాలని పదే పదే నోట్లో స్మరిస్తూ కిరాణా కొట్టుకెళ్లి చిల్లులు పడ్డ చెడ్డి జేబులోంచి పది రూపాయలు తీసి తిరగలేని నాలుకతో స్మరిస్తున్న పేచ్ కీమ్ (పేస్ క్రీమ్) పదాన్ని షావుకారు చెవిలో సన్నగా వొదిలాడు.
షావుకారు ధరుడి ముద్దుమాటలు మళ్ళీ మళ్ళీ వినాలని
ఏంకావాలి ఏంకావాలి నాయన అంటూ ఆటపట్టించి సిన్నగా నవ్వుకుంటూ ఫేస్ క్రీముతో పాటు చిల్లర రెండురుపాయలు జేబులో వేసాడు. ధరుడు అవెక్కడ పడిపోతాయో అమ్మెక్కడ కొడుతుందో అనే భయంతో రెండు చేతులను జేబుకి అదిమిపెట్టి మెల్లిగా కొట్టు నుండి ఇంటికి అడుగులేస్తుంటే షావుకారు వెనక్కి పిలిచి ఇదిగో ధరు అని ఒక పిప్పరమెంటుబిళ్ళని నోట్లో వేసి పంపించాడు.దాన్ని చప్పరిస్తూ వస్తున్న ధరుడి కళ్ళు పక్కనే ఆడుకుంటున్న పిల్లల ఆటపై పడింది. దగ్గరికెళ్లి ఆటని, పిల్లలని అశ్చర్యంగా చూస్తూ అమ్మ చెప్పిన పనిని సగంలోనే మర్చిపోయి నిల్చుండిపోయాడు.శాంతదేవి అప్పటికే ఇంటికొచ్చిన పట్వారితో సరసాలడి ధరుడొస్తాడు నేనొస్తాలెండి అని ఆయన్ని పంపించి జోరుగా ముస్తాబవ్వడానికి శరీరాన్ని సుగంధాలతో బాగా తోమి నవ వస్త్రాలంకరణ, కురులతో పొరు చేసి ధరుడింకా రాలేదని ఆలా ధరుడికోసం రోడ్డెక్కి చూసింది. ఆటల్లో మునిగి దెబ్బలు తగిలి ఏడుస్తూ కళ్ళని నలుచుకుంటూ వస్తున్న ధరుడి దగ్గరికి పరుగు పరుగున వెళ్లి ఎంతసేపయ్యింద్ర ఎదవ ఏది నా క్రీమ్ అంటూ… ఆటల్లో తగిలిన దెబ్బల గుర్తులకంటే ఎక్కువగా తన హస్త దెబ్బలు వీపుపై అచ్చుపడేలా బాధి ఇంటికి లాక్కొచ్చింది. వెంటనే పట్వారి నుండి సందేశం వస్తున్నావా శాంత తొందరగా రా అని.హడావిడిగా ముస్తాబయిన శాంతదేవి ధరుడి ఎక్కిళ్ల మోతని ఆపలేక మల్లీ రెండు మొట్టికాయలేసి చిల్లర
రెండు రూపాయలు మోహన కొట్టి ఇంటికి తాళమేసి వెళ్లిపోయింది.
దెబ్బల తాకిడి తలలేని ధరుడు కళ్ళు భైర్లుకమ్మి కూర్చున్న చోటే పడిపోయాడు.
పట్వారీతో రంజుచేసి ఆయనిచ్చిన హారాన్ని మేడలో వేసుకుని థాపిగా తిరిగొచ్చిన శాంతదేవి కింద పడివున్న ధరుడిని చూసి పాపిష్టి సంత కడుపులో ఉన్నప్పుడే నలిపేసుంటే పోయేది అని గోనుగుతూ ధరుడి మోహన ఒక్క తన్ను తన్నింది… నొప్పుల మత్తులో సొమ్మసిల్లిన ధరుడు ఆ.. తన్నుకి అమ్మా అని వెలిక్కిపడి లేచి నక్కి కూర్చున్నాడు.తాళం తీసి హారాన్ని బీరువులో పెడుతుంటే వెనకాలే వెళ్లి అమ్మ ఆకలి అని కొంగు పట్టుకు అడగ్గా.. శాంతదేవి ఒక్క చూపు చూసింది భయానికి గోడకి హత్తుకున్నాడు. అదే సమయంలో అమ్మా బిక్షం అంటూ ఓ ముసలాయన కేకలు. కేకలు విన్న శాంతదేవి ఇదగో వీన్ని తీసుకెళ్ళు అని ధరుడి చేయి పట్టుకులాక్కెల్లి ముసలాయన ముందు పారేసింది. ఆకలి ఆకలి అనే అర్థనాధలు విన్న ముసలాయన ధరున్ని మెల్లిగా పైకిలేపి తన సంచిలో ఉన్న బ్రెడ్డు ముక్కను తీసి బాబు చేతిలో పెట్టాడు.అది చూసిన శాంతదేవి తండ్రి బుద్ధులు పునికి పుచ్చుకున్న ఎదవ అడుక్కుతినే కుక్క ఈ పూట తినకపోతే చస్తావా అని ఒక్కటిచ్చింది. ఆదెబ్బకి కిందపడ్డ ధరున్ని కాలు పట్టి లాక్కొచ్చి ఇంట్లో పారేసింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ.. ఘనకార్యన్నంత చూసి మొగుణ్ణి చంపేసిన ముండ పిల్లోన్ని కూడా చంపేసేలా ఉందని బాలల సంక్షేమ అధికారికి సందేశాన్నిచ్చారు.ఆ సమయంలోనే పట్వారీ పాలేరు శాంతదేవి ఇంటికొచ్చి సారు హరణ్నిచ్చారంటగా నేను వడ్డాణం, కడియలిస్తాను కానీ షరతుగా రెండు రోజులు నాతోనే ఉండాలని అడగగా నగలపై వ్యామోహంతో కూడు కుంపటి లేని శాంతదేవి అతనితో కూడా పోడానికి ముస్తాబయ్యి ఇంటికి తాళన్నెస్తుంటే ధరుడు కనబడ్డాడు
రెండు రోజులు వెళ్లాలంటే ధరుడు ఎలా అని ఆలోచించగా పట్వారీ మాటలు(ఎప్పటికైనా తండ్రిలాగా వీడు మనకడ్డోస్తాడు వదిలించుకుంటే పోతుంది )గుర్తుకొచ్చి పాలేరుకు వెళదాం కాస్తయ్యాక అని సమాధానమిచ్చి పడివున్న ధరుడి జుట్టుని పట్టుకుని ఇంకా లోపలికి లక్కెల్లి మెడపైన ఒక్క పోటువేసింది అంతే ఆ.. పోటీకి ధరుడి జీవం అమ్మా అనే పలుకుతో చేతిని తల్లి కొంగుకు తాకి ….యే తప్పు చేసానో అని అమాయకపు చూపులతో సమాధానమిచ్చి కళ్ళుమూసాడు. మెడ నుండి పారుతున్న రక్తపుసంద్రం పాదాలను కడుగుతుంటే తల్లి జన్మ సిగ్గుపడింది.

తల్లిదండ్రులమధ్య గుణగణాలతో పొదుగుకోబడి సమాజన్ని ఉద్దరించబోయే పసికందుల భవిష్యత్తు లోకమేరుగని వయస్సులోనే అంతమవుతుంటే చూడలేక తల్లడిల్లే ఒక తల్లి మనసే మారిపోయే సమాజంలో సాగిస్తున్న బతుకులు మనవి మార్పు ప్రతీ ఒక్కరిలో తీసుకురాకున్నా సరే మనలో వచ్చే క్రూర మార్పులను అదుపుచేసుకోగలిగితే చాలేమో మనిషి బ్రతుకుని మనిషిగానే ముగిద్దాం……. మీ చిరునవ్వు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!