“ఈ సెల్ ఫోన్లు మాకుద్దు”

“ఈ సెల్ ఫోన్లు మాకుద్దు”
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : యాంబాకం

   ‘కర్మ రా..! బాబు మేము జాబ్‌‌ లో చేరినప్పుడు ఎంత హాయిగా ఉండిందో. ఈ వెధవ సెల్ ఫోన్ వచ్చాయి ప్రతి వాడికి సమాధానం చెప్పాల్సిన దుస్థితి పడింది, అని మనసులో తిట్టుకుంటూ!’ రామారావు రింగ్ అవుతున్న తన ఫోన్ ని లిఫ్ట్ చేసి హలో..! అన్నాడు. అవతల  నేనండి మాణిక్యం మిరపకాయలు ఈరోజు మార్కెట్ ఎంత? పలుకుతుంది అన్నాడు, మిరపకాయలకు నాకు ఎంటి సంబంధం అనుకుని రామారావు కాస్త సౌండ్ పెంచి నీకు ఏ నెంబర్ కావాలి? బాబు అన్నాడు, నేను నండీ ఖని నుంచి మాట్లాడుతున్నా నండే ఇప్పుడూ మిరపకాయలు.. అని పూర్తి కాకముందే రాంగ్ నెంబర్ అని కోపంగా! పెట్టేవాడు. రామారావు, ఇంతలో మరోక ఫోన్ దాని రింగ్ టోన్ “ఆకలేస్తే అన్నం పెడతా మూడ్ వస్తే ముద్దులు పెడతా చిన్నోడా”…అంటూ రామారావు కి ఆ రింగ్ టోన్ ఇరిటేట్ గా! ఉంది అవతల ఎవరో ఎమో! అని హాలో అన్నాడు. ఓరే రామారావు అన్నాడు అవతలి వైపు! హలో.. హలో మీకు ఏ నెంబర్ కావాలి అన్నాడు తిరుపతిలో ఉండే రామారావు కదా! అని స్పీడ్ గా ఓరే రామారావు అన్నాడు. మళ్ళీ ఇక చేసేది లేక రామారావు రాంగ్ నెంబర్ please అన్నాడు. ఒక ఐదు నిమిషాల తరువాత ఫోన్ వచ్చింది. రామారావు చూశాడు. ఇది కూడ ఏ “చింతపండు వ్యాపారిదో అయ్యి ఉంటాడు నా సార్థం, నా పిండకూడు, అని కట్ చేశాడు”. ఇంతలో అవతల ఫోన్ చేసింది ఇంటి దగ్గర నుంచి రామారావు భార్య రమాకాంతం, అని తెలియక అయ్యో! రామారావు ఈయన గారికి ఫోన్ ఎత్తిడం కూడ బద్దకం ఇప్పుడు వాకింగ్ కేగా పోయాడు, కాలీగా చేతులు ఊపుకుంటూ నడవటమే గా ఫోన్ ఎత్తచ్చుగా! అనుకుంటూ! బయట నుంచి లోపలికి వచ్చి ఫోన్ ఛార్జింగ్లో పెట్టింది. కానీ కరెంటు పోయింది. “ఈ దిక్కుమాలిన కరెంట్ ఎప్పుడు ఉండి చస్తుందో ఎప్పుడు పోయి చస్తుందో అర్థమై చావదూ”! వచ్చేటప్పుడు దారిలో కాస్త పూజకు పూలు తెమ్మందామని ఫోన్ చేశా! అది కూడా బయట ఇస్త్రీ బండి వాడి ఫోన్ నుంచి చెస్తే ఆయన గారు లిఫ్ట్ చేస్తే ఏమైనా మునిగి పోతుందా! అదే ఇంకా ఏమైనా అవసరమై ఉంటేనూ, అంటూ హల్లో ఉడికి పోతుంటే బయట గాలి కోసం బయట పోయింది రమాకాంతం, బయట ఎవరో చిన్న పిల్లవాడు సెల్ ఫోన్ ల్లో కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నాడు. ఎవరిని పట్టించు కోకుండా! తెగ చూస్తున్నాడు. వాడివాలకం అదోలా ఉంది.
‘కాంతం వీడు ఫోన్ అంత సైజ్ లేడు అంత ఆత్రంగా ఏమి చూస్తున్నాడంటావు కర్మ అంటూ ఇక కాస్త ముందుకు పోయింది”. ఇంతలో బయట ఒక వ్యక్తి హలో అన్నాడు. ఫోను తీసి ఫోను మెడకింది పెట్టుకోని సిగరెట్ వెలిగించుకొని ఒక దమ్ము లాగి కాస్త పెద్దగా ఆ వినపడుతుంది చెప్పురా! అన్నాడు. “అవతల ఎవరో మాట్లాడుతున్నారు. అవునా?ఎమైందింట, నాకు అప్పుడే తెలుసు ఇలా జరుగుతుందని, నా మాట విన్నావా! బాబు నన్ను ఇన్వాల్వ్ చేయకు నేను ఎప్పుడూ అంత దూరం పోలేదు. నేను ఎదో ఒకసారి కిస్ చేసా! అంతే ఓరే ఆ “పిల్లా భలే డేంజర్ రా! నాకు రెండు సార్లు ఇంకా ఎక్కువే అనుకుంటా మన గోపిగాడితో కనిపించింది” ఫోటోలు ఉన్నాయంటరా! “అసలు నీవు ఎక్కడ ఉన్నావో చెప్పు నేనే వస్తాను. అని ఫోన్ కట్ చేసి సిగరెట్ పడేసి అక్కడే పార్క్ చేసి ఉన్న బైక్ పై వెళ్ళి పోయాడు, ఇంతలో రామారావు ఇంటికి చేరాడు, ఇది అంతా వింటున్న రమాకాంతం ఈ ఫోన్లు వచ్చాక చిన్న పెద్ద తేడా లేకుండా, భయం, భక్తి లేకుండా పోతుంది. మరియు, అని ఇటు చూసింది. రామారావు ఎమండీ ఫోన్ చేస్తే తీయరు ఎంటండి, నీవు ఫోన్ చేశావా! అంటూ ఫోన్ చెక్ చేసి ఎది నాకు రాలేదే నిన్ను మడిసి పొయ్యిలో పెట్టా, అన్నాడు. అదా..! నా ఫోన్ ల్లో చార్జ్ లేక ఇదిగో ఇస్త్రీ బండి వెంగయ్య మొబైల్ తో  చేసాను. వాడి మొహానికి కూడ సెల్ ఫోన్ వచ్చి చచ్చిందా! మారోజుల్లో  ఇక చాలేండి మీరోజులు మహా రోజులైనట్టు అలాగ ఏమి చేయమంటావు పొద్దునుంచి ఒకటే రాంగ్ నెంబర్ అదికూడ  రాంగ్ నెంబర్ అనుకొన్నా ఎందుకు చేసావు చెప్పి చావు! అదా, అనే లోపు మరో కాల్!
“హలో..అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి రామారావు అవతల ఆడ గొంతుతో సార్ మేము దినదినాభివృధ్ధి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము. “మీకు ఐదు లక్షలు బహుమతి వచ్చింది, అవునా! తల్లి ఎంత చల్లటి మాట చెప్పావు. చిక్కటి మజ్జిగలో చక్కెర వేసుకొని తాగినంత కమ్మగా ఉంది”. ఒకసారి మీరు మా బ్యాంక్ ని సంప్రదించ గలరు. అని పెట్టేసింది. తరువాత ఆ నెంబరికి ఫోన్ చేసాడు రామారావు. లిఫ్ట్ చేయలేదు. ఇంతలో కరెంట్ వచ్చింది రామారావు రమాకాంతం ఫోన్లు ఇద్దరివి ఛార్జింగ్ పెట్టారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. “రమాకాంతం ఎవరూ అంటూ వెళ్ళి తలుపు తీసింది.” మీరా రండి కూర్చోండి మీరు వస్తున్నట్టు కాల్ చేయలేదు. చేశానమ్మా నీ ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓ అదా! నేను మొబైల్ ఛార్జింగ్ పెట్టాను చేసుకోలేదు అన్నయ్య అది ఆగిపోయింది”. ఇప్పుడే కరెంటు వచ్చింది. ఆయనకు చేయకపోయారా చెప్పేవాడు కదా! వాడికి చేసా ఎప్పుడూ ఏదో ఒక కాల్లో ఉండి తగలెడుతూ ఉంటాడు. పిల్లలు ఏలా ఉన్నారు? అంది రమాకాంతం అయ్యో ఎమి చెప్పమంటారు. ఇరవైనాలుగు గంటలు ఫోన్ ల్లోనే, ఇక వాళ్ల అమ్మ అదే మీ వదిన ఐతే ఆన్లైన్ లో అది, ఇది కొనడం ఆ వీడియోలు, ఈ వీడియోలు ఆ పత్రిక, ఈ పేపరు అంటూ అసలు మనుషులనే పట్టించుకోకుండా వచ్చేశారమ్మ! “అసలు మనుషులతో మాట్లాడే పద్దతే పోయింది”. గంటలు గంటలు ఫోన్లు మెసేజ్లు ఆన్లైన్ బుకింగ్లు, ఇంకా ఈ మధ్య వంటలు అని పాటలని, టిప్స్ అని ఏవోవో! కూడ చెసి ఫేస్ బుక్ లో యుట్యూబ్ లో పెట్టడం కనీసం అన్నం కూడా వడ్డించేదానికి తీరికలేక పోయి, పెట్టుకోని తినండి అంటున్నారంటే నమ్ము అన్నాడు భజగోవిందం. అన్నయ్య రామకాంతంతో, ఇంతలో రామారావు స్నానం చేసి వచ్చి ఎందిరా నమ్ము అంటున్నారు. “నిన్న ఎమైనా వానలో తడిసావా ఎంది కప్పలు పట్టేవాడిలాగ అన్నాడు”. “అదేరా ఈ సెల్ ఫోన్ బాగోతం గురించి అన్నాడు నిష్టూరంగా! నిజమేరా ఈ ఫోన్లు వచ్చి మనుషులకు, మనుషులకు మధ్య పెద్ద అడ్డుగోడగా మారిపోయాయి. ఇదిగో చూడు ఇప్పుడు నేను ఫోను పెట్టి స్నానాని కి పోయినప్పటి నుంచి నాలుగు కాల్స్ వచ్చాయి, ఇప్పుడు మనం ఫోను ఎత్తలేదు అంటారే గాని ఎందుకు ఎత్తలేక పోయాడో వారికి అనవసరం లేదు, తరువాత సారీ కూడ చెప్పాలి. ఈ ఫోన్లు మన ఇమేజ్ ని పెంచుతున్నా యంటావా! లేదా తగ్గిస్తున్నాయంటారా! అంటూ ఫోన్ చేసి నాలుగు నెంబర్ లో ఒక నెంబర్ కు కాల్ చేసాడు, రామారావు. ఇంతలో ఆఫీసు నుంచి ఫోన్ అది కట్ చేసి ఆఫీసు ఫోను లిఫ్ట్ చేసి “హాలో సార్ అన్నాడు, రామారావు అవతల నుంచి రావుగారు మీరు ఆఫీసుకు బయలుదేరినారా!” ఏమిలేదు, మనం నిన్ను పంపిన స్టేట్మెంట్ మీ మొబైల్ లో ఉందా? ఉంటే ఒక సారి నాకు సెండ్ చేయరా! ఆ..!అలాగే సార్ తప్పకుండా సెండ్ చేస్తా ఉంటా! ఆ ఆఫీస్ కి వస్తున్నా, ఇంతలో రమాకాంతం ఫోన్ మోగింది పరుగెత్తు కుంటూ పోయి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఆ వదిన చెప్పండి కాంతం బాగున్నావా! ఆ బాగున్నా వదిన ఏమి సంగతులు ఏముంది వదినా నిద్రలేచి కాఫీలు, టిఫిన్లు, క్యారేజ్లు, బట్టలు, ఇవే, ఈరోజు పని మనిషి కూడా రాలేదు, ఫోన్ చేసి తలనొప్పి గా ఉంది మేడమ్ అని ఈరోజు రాలేను అని సింపుల్ గా చెప్పేసింది. ఆ మరీనూ కాంతం మొన్న “మా పనిమనిషి కూడ ఇదిగో ఇలాగే ఫోన్ చేసి గొలగమూడి కి పోతున్నాము ఆంటీ ఈరోజు రావడంలేదు అని బాగ పొద్దు పోయాక చేబుతుంది. ఈ సెల్ వచ్చాక సెలవులు ఈజిగా ఉందివాళ్ళకి చెప్పడానికి, ఇంతకీ ఫోన్ దేనికి చేశారు వదిన ఏమి లేదు ఏమి తోచక సరే అని ఒకసారి పలకరిస్తామని అంతే ..! అలాగ సరే వదినా ఒక్క పని కాలేదు, నేను తరువాత ఫోన్ చేస్తాను. సరే ఉంటా! అంటూ ఫోన్ కట్చేసి కాంతం “మేసే గాడిద వచ్చి కూసే గాడిద ను చెడకొట్టినట్టు”, ‘ఊరికే చేసిందట అని మనసులో అనుకుంటూ’! సరే రమా, నేను ఆఫీసుకు బయలుదేరుతున్నా అన్నాడు రామారావు ఇంతలో ఫోన్ హాలో అన్నాడు రామారావు. రాము నేను రమేష్ ని, “హలో రమేష్ నమస్తే ఏలా ఉన్నారు” “నమస్తే రాము, బాగున్నాను. మీరు వెల్ అండ్ గుడ్ సరే ఎక్కడ? “ప్రస్తుతం ఇంట్లో ఇదిగో ఇప్పుడే ఆఫీసు కు పోబోతున్నా నీ ఫోన్ వచ్చింది అన్నాడు”. సరే రాము రేపు సండే మేము వత్రం చేసుకుంటున్నాము నీవు రమాకాంతం తప్పక రండి. అన్నట్టు పిల్లలు ఇక్కడ లేరుగా అందరూ స్టేట్ లోనే గా ఉండేది. అవురా! నేను రిటైర్ ఐతే వెళ్ళాళని అనుకుంటున్నమ్. సరేరా తప్పక వస్తాములే, ఓకే తరువాత ఫోన్ చెస్తా అని ఫోన్ కట్ చేసిన తర్వాత, మొహం మండ ఈ సెల్ ఫోన్ వచ్చాక కార్యానికి పిలిచే పద్దతే మారిపోయాయి. మనిషి ఫేస్ చూడకుండా నే, కనిపించకుండా నే రమ్మని పిలిచేస్తున్నారు. మా రోజుల్లో పిలుపులకు ఒక పద్ధతి ఉండేది నా మొహం నా సార్దం, అబ్బబ్బ.. పొద్దున ఐదు గంటలకు నుంచి ఫోన్లు ఫోన్లు ఫోన్లు ఇదే అనుకుంటూ! కారులో ఆఫీసుకు బయదేరాడు రామారావు. “ఇంతలో కొడుకు స్టేట్ నుంచి కాల్ డాడ్.. ఆ చెప్పురా! ఇప్పడే వచ్చాను డాడ్, సరే ఏమైనా తిన్నావా? లేదు డాడ్, అమ్మకు ఫోన్ చేసాను. మీరు ఇప్పడే ఆఫీసు కు వెళ్లారు అని చెప్పింది. సరేరా నేను డ్రైవింగ్ లో ఉన్నా తరువాత చేస్తా. హ్యాపీ నే..కదా నువ్వు, బాయ్. ఓకే బాయ్.. అంటూ ఫోన్ కట్ చేసి చిన్న గా ఆఫీసు చేరాడు. రామారావు. “అక్కడ ఒక బ్రోకర్ వెధవాయ్ ఇలా మాట్లాడుతున్నాడు”. నేను ఈ ఆఫీసులో చేరి 20 సంవత్సరాల అయ్యింది. నాకు ఇరవై ఏళ్ల అనుభవం ఉంది! ఇక్కడ మనకు ఏపనైనా ఇదిగో ఇట్టే చేపిచ్చేస్తానోవొ! వెధవది ఫోన్ ల్లోనే కాకపోతే బాగా ఇచ్చికోవాలి మరీ పిండి కొద్దీ రొట్టె అన్నారు! కాదా..! అంటూ సొళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. “రామారావు ఆఫీసు కి వచ్చి కంప్యూటర్ ను ఆన్ చేసి ఎదో ఫైల్ చూడడం మొదలు పెట్టబోయాడు”. “వెంటనే కాల్ తీసి హాలో ..! అనక తప్పుతుందా!” హాలో రామారావు ని మాట్లాడుతున్నా అన్నాడు ఇంగ్లీషు లో అవతల నమస్తే సార్ మేము HDFC Bank నుంచి మీకు పర్సనల్ లోను కావాలా సార్? అంటూ ఒక మేడమ్ గొంతు. “రామారావు అవతల లేడీ ఎందుకు కని మర్యాదగా వద్దండి thank you !! అని కాల్ కట్ చేసాడు.” “రమాకాంతం బాత్రూమ్ లోకి అప్పుడే స్నానానికి పోబోతుంది. అప్పడే ఫోన్ మోగటం ఆరంభం అయింది. “ఎవరో ఏమిటో అని బాత్ రూమ్ కు పోకుండా నే వచ్చి కాల్ తీసింది”. మేడమ్ మేము “మెడి లేడీ బ్యూటీ కేర్” నుంచి అంటే మా దగ్గర చాలా తక్కువ ధరలో ఫ్యాకేజ్ ఉన్నాయి. మీకు Interest ఉంటే మా ఏజెంట్ కలుస్తారు మేడమ్. “రమాకాంతం కి కోపం కానీ శాంతం వద్దండి తరువాత చూస్తాం! అని టఫీ అని కాల్ కట్ చేసి, స్నానానికి వెళ్ళి పోయింది”. ఇంతలో మళ్ళీ ఫోన్ మొన్నటి రోజు రమాకాంతం ఆన్ లైన్ లో ఒక శారీ పెట్టింది షాఫీలో ఆ డెలివరీ బాయ్.” కానీ రమాకాంతం కాల్ లిఫ్ట్ చేయలేదని ఆ డెలివరీ బాయ్ రిటన్ లో పడేసాడు”. “రమాకాంతం తరువాత ఫోన్ చేసినా వాడు కాల్ తీయలేదు సరి కదా, తిరిగి రెండోవ సారీ కూడ రాలేదు”. మన రామారావు ఆఫీసులో ఒక్కొక్కరు ఆఫీసుకు రాసాగారు, ఒక మేడమ్ వచ్చి రాగానే తన ఫోన్ ఓపెన్ చేసి ఏమైనా కాల్స్ మెసేజ్ లు వచ్చిఏమో! అంటూ చూస్తూ ఉంది. అటండర్ సెల్ తీసి వీడియో గేమ్ లు ఆడుతున్నాడు ఆపరేటర్ ఫేస్ బుక్ లో ఏదో గాలి వీడియో లు చూస్తున్నాడు. అవి ఎవరెవరికో పోస్ట్ చేస్తున్నాడు. “ఒక్క మాటలో చెప్పాలంటే ఆఫీసు స్టాఫ్ అంతా సెల్ ఫోన్ మైకంలో ఉన్నారు. ఒక్క రామారావు తప్ప ఇదే ప్రస్తుతం ఫోన్ ఇంటింటి రామాయణం.”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!