ఏ శృతిలో పలుకుతుందో?

అంశం : స్వేచ్ఛా స్వాతంత్య్రం ఎక్కడ??

ఏ శృతిలో పలుకుతుందో?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: మీసాల చినగౌరినాయుడు

మంచు బొట్టు పెట్టుకొని
మానవీయ చీర కట్టుకొని
సమతమమతల కౌగిళ్ళలో
పొదువుకున్న బిడ్డలు
కేన్సర్ గడ్డలై దేహాన్ని
కుళ్ళబెడుతుంటే
నా స్వతంత్ర్యం నట్టేట కొట్టుకుపోతుంది.

ఎటుచూసినా చీకటిదారులే
ఎక్కడికెళ్లినా రక్తపు జాడలే
మానమాలిన్య వికృతకేళీ క్రీడలే
మృగత్వపు కర్కశ కరాళనాట్యాలే
అణగారిన ప్రాణంపై ఆధిపత్య పాషాణం
వందేమాతరగీతంలో డబ్భైయేళ్ల భారతం
ఒంటరిదైపోతోంది.

ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్న నాదేశం
ఏ సూక్ష్మజీవికి బలికానుందో?
నిర్లక్ష్యపు అంచున నిలబడి
ఏ అగాధంలో పడనుందో?
జనగణమన జయగీతం
ఏ శృతిలో పలుకుతుందో??
రెపరెపలాడే జాతికేతనం
ఎప్పుడు సగర్వoగా ఎగురుతుందో??

You May Also Like

One thought on “ఏ శృతిలో పలుకుతుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!