విందు భోజనమే

విందు భోజనమే
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యునితో పాటు పాలవాడు, పేపర్ వాడు వచ్చి కాలింగ్ బెల్ మోగిస్తారు.” అందులో ఉన్న కోకిల కుహు.. రావ సంగీతం ఒక ఆనందము.” అపార్ట్మెంట్లు వచ్చాక కోకిల కూతలు, గానాలు తగ్గి పోయాయి. “మిద్దేమీధ తోటలో ఉదయం మొక్కలు పరిశీలిస్తూ నీళ్ళు పెడుతూ ఓ గంట కాలము
వెళ్ళ బుచ్చటం రాఘవకి అలవాటు.” కొడుకు శ్రీను ఉన్నా వెళ్లి మొక్కల సేవ చేస్తాడు. పెద్దల మాటకు కట్టుబడి, బహుళ అంతస్తుల సౌధాలు కాకుండా రాఘవ పెద్ద నాలుగు రెళ్ళు ఎనిమిది వాటాల పెద్ద మెడ కట్టించి అందరూ ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేశాడు. “పెద్ద కొడుకు కనుక తల్లి తండ్రినీ దగ్గర పెట్టుకున్నాడు”. ఇంట్లో అంతా పురాతన సంప్రదాయాలకు కొలువు. “తమ్ముళ్ళూ విదేశాలు వెళ్ళినా సరే మన సంధ్య వందనాలు మానలేదు”.
ఇప్పటికీ ఎవరి సంపాదన వారు అయిన సరే పండుగలకు అంతా ఒక చోట కలిసేలా ప్రయత్నం చేస్తారు. ఏడాదిలో ఒక పండుగ అయిన కలవాలి. సరే ఈ రోజు పాల విషయంలో సంతృప్తి ఉండదు. నీళ్ళ పాలు అంటూ అత్తగారు పూర్ణ విసుక్కుంటూ రోజు పాల వాడికి స్తోత్రం చెపుతూనే ఉంటుంది.
ఇంకా కూరల వాడు వస్తే వాడికి దండకము పెడుతుంది. “స్త్రీలకు అంతా జాగ్రత ఆహార పదార్థాలపై ఉండటాన్ని బట్టే ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యము రుచికర ఆహారము”. అప్పటికి మిద్దె తోటలో బెండ, వంగ, పోట్ల, బీర, అనపా, గోంగూర కొత్తిమీర, కరివేప, మెంతి కూర పెంచుతారు. మిగిలినవి వీలును బట్టి కొంటారు. వీరంతా అస్థానంలో విద్వాంసులు. అత్త పూర్ణ చేత రోజు దీవెనలు పోంది. ఎదో ఒక సరుకు ఇచ్చి వెడతారు. పువ్వుల వాడు కూడా చామంతి, లిల్లీ, గులాబీ, తామర వంటివి  తెచ్చి ఇస్తాడు. కార్తీక మాసం అయితే మారేడు దళాలు తెచ్చి అమ్ముతారు.”ఈ కలియుగంలో గడ్డి ఆకుతో సహా అన్ని అమ్మకలే కదా!” సరే కాఫీ చల్లారి పొంటుందని ఫ్లాస్క్ లో పోసింది రాఘవ వచ్చి తాగుతాడు. “సునంద జీవన సరళి చాలా తమాషా గా ఉంటుంది”. అటు పెద్దల తరంలో ప్రతి మాటకు వేటకారం, సామెతలు
ఉంటాయి. “బింది ఎత్తలేని అత్తగారుకి చెంబు ఎత్త లేని కోడలు హా హా హా అంటుంది”. ఈ తరం అమ్మాయిలు చాలా నాజూకుగా ఉంటారు. అన్నిటికీ విద్యుత్ పరికరాలు పై ఆధారము. సునంద ఆ మాటకి సునామీ చేస్తూ ఉంటుంది. ఏమిటి? మీకు నేను ఏమి లోటు చేశాను అంటుది. ఇంకా ఆరోజు ఇంట్లో అంతా గలాటాయే అత్తకి కోడలు చేసిన పని ఎది నచ్చదు. రాఘవ ఓ కార్డు తెచ్చి చేతిలో పెట్టాడు అది ఒక ఇన్విటేషన్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంట్లో షష్టి పూర్తి సందర్భంగా శుభ లేఖ. అది అందిస్తూ చక్కగా సంప్రదాయంగా చేసుకుంటున్నారు. అమ్మ నీకు నాన్నకి ఇంత ప్రయోజకులు అయిన కొడుకులు అన్న, మేము మీకు పంచ సప్తశతి పుట్టిన రోజు చేస్తాము అన్నాడు. “సునంద మా పిల్లలు చేసే పండుగ మీరు తప్పక రావాలని! ఫోన్ లో కూడా నెల ముందే చెప్పింది. మీ అత్తగారిని కూడా తీసుకు రా! ఆవిడ పూజలు చేస్తాము అన్నది. “అంతే కాదు వాళ్ళ పిల్లలు చేసిన డిజిటల్ శుభలేక పెట్టింది. పిల్లలు తను కలిసి పిలిచారు కూడా ఇన్ని పిలుపులు పిలిచిన! వారింటికి వెళ్ళాక పోతే ఎలా? అత్తగారు కూడా రావడానికి ఇష్టత చూపింది. సరే అంటూ ఆరోజు ఆటో పిలిచారు. సునంద స్నేహితురాలు మంచి బిజినెస్ మైండ్ ఇంటిల్లిపాథి చదువుతో, పాటు తల్లికి సహాయం చేస్తారు. మంచిమనస్తత్వం  కలవారు. “సరే ఆటో ఎక్కి బయలు దేరారు. సునంద షాపు దగ్గర ఆల్GFD పళ్ళు, పూలదండలు కొన్నది. రావికెల బట్ట, గాజులు, పసుపు, కుంకుమ పెద్ద ప్యాకెట్లు కొన్నది. వీళ్ళు వెళ్ళే సమయానికి నవగ్రహ పూజ, అష్టదిక్పాలకులు పూజ, శివలింగ అభిషేకము, కలిసేపూజ ఇలా షష్టి పూర్తికి చేసే పూజలు అన్ని శాస్త్రోక్తంగా చేసి లేచారు. “ఆ తరువాత పురోహితుడు తీర్థం అందరికీ పంచారు” ఇంకా హోమాల దగ్గర ఉన్నారు. నక్షత్ర హిమం చేస్తున్నారు. ఇంకా పద్ధతిగా ఎన్నో మాత్రలు శాంతులు చేసి పూర్ణాహుతి చేశారు. మేము వెళ్ళగానే వాళ్ళ పిల్ల ఎదురు వచ్చి రండి అంటూ లోపలికి తీసుకు వెళ్లి బాదం పాలు ఇచ్చింది. అంతా తాగరు దాని ఫ్రెండ్ ఓ పూజారి భార్య వచ్చింది.
ఆమెకు మడి ఆచారం అందుకు ముందు చేతులు కడిగి మళ్ళీ పాలు ఎత్తి పోసుకుని తాగి. చేతులు కడిగింధి. ఆవిడ కచ్చా పోసి చీర కట్టింది. ముక్కుకు పుడక బేసరి, నత్తు అడ్డబాస పెట్టుకుని ఉంది. కాళ్ళకి కడియాలు పట్టీలు కూడా పెట్టుకుంది. మువ్వల చుట్లు పెట్టుకుంది. చేతికి చాలా గాజులు ఉన్నాయి. ఈ వేషం చూసి అవిడ దగ్గరకు ఈ తరం పిల్లలు వెళ్లి ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు. ఇలా అన్ని సెట్టుగా ఇస్తారా అన్నారు. ఆవిడ అర్థం కాక ఏమిటి? అంటోంది. వాళ్ళు డ్రెస్ చూపించి ఇది ఎలా కట్టారు అంటారు. ఇది ఒక రకం పంజాబీ డ్రెస్ అంటారా అన్నారు. ఆవడకి ఇదే చీర అంటారు అన్నది. ఈ చీర ఎలా కట్టుకున్నారు అంటూ ప్రశ్నలు వేశారు? వాళ్ళకి విశాధికరించడంలో ఎన్ని రకాలు హాస్యాలు పండింది. నవ్వలేక అక్కడి వాళ్ళు కళ్ళ నీళ్ళు కూడా వచ్చాయి. ఒక ప్రక్క హోమం పొగ మరో ప్రక్క హాస్యం రెండు కలిసి కళ్ళ నీళ్ల మయం అయ్యింది.
అది అయ్యాక గంగోత్రి స్నానంలో వాళ్ళ బంధువులు పిల్లలు అంతా కలిసి చాలా బాగా నీళ్ళు జిమ్ముకుంటు, పువ్వులు విసురు కుంటు చలోక్తులు విసురుతూ మహా సంతోషంగా పిల్ల, పెద్ద, వృద్ద అంతా స్నానం చేశారు. ఇల్లంతా తడి తడి బట్టలు మార్చారు. పెరడులో విడిగా గంగళాలు పూర్వకాలం గుండి గలు తెచ్చి బంతి పూలతో అలంకరించి నీటితో నింపారు. అది ఒక ఆనందము అందరికీ శాంతం సంతోషం పంచారు. అలా వినడం చూడటం కూడా పుణ్యమే అంటారు పెద్దలు,
పెళ్లి కొడుకు, పెళ్ళి కూతురుగా ఆడపడుచులు చేసి వేదిక ఎక్కించి సూత్రాలు నల్లపూసలు కట్టించి చుట్లు పెట్టారు. సరే మీరు భోజనానికి రండి అంటూ వాళ్ళ అక్కలు దగ్గర ఉండి తీసుకు వెళ్లారు. అత్తగారు మాత్రం ఇక్కడ భోజనం అంతా వెజిటేరియన్ ఉంటుందా అన్నారు. అయ్యో అంటి మేము కూడా ఇలాంటి ఫంక్షన్ కి నాన్వెజ్ పెట్టాము. రండి నేను దగ్గర ఉండీ పెట్టీస్తాను అన్నది. వంట మాత్రం వెజిటేరియన్ అయిన వడ్డించే వాళ్ళ అన్ని రకాల వడ్డనలు చేసే అలవాటు ఉన్నవాళ్లు ఉన్నారు. అరటి ఆకులు వేశారు పప్పు వడ్డించారు. ఆ తరువాత బకెట్  తెచ్చిన కుర్రాడు, ఫుల్ మటన్ కర్రీ అన్నాడు. అంతే మా అత్తగారు కి భయం మొదలయ్యింది. ఇక్కడ మటన్ అంటే మాంసం కాదే, అదికాదు ఫుల్ మఖాన్ అనాలి ఆ కుర్రాడు. నాన వెజ్ వడ్డించే వాడు అవుతాడు అన్నది. ఆ తరువాత ఆ కుర్రాడి మళ్ళీ తోటకూర లివర్ అన్నాడు. దానికి వద్దు అంటు చెయ్యి అడ్డంపెట్టాము. ఇదేమిటి ఈవెంట్ మేనేజర్ నీ పిలిచి ఇది ఏమిటి నాన్ వెజ్ వంటలు అన్నాము. లేదు ఇది వెజ్ అమ్మ తినండి అన్నాడు. కానీ మనసు ఒప్పుకోదు, బూరెలు పులిహోర వేశారు.
ఆ ప్రక్కనే బిర్యానీ పెరుగు పచ్చడి ఉల్లిపాయలు వేశారు. వెల్లుల్లి మామిడి కాయా తెచ్చాడు దాన్ని చూసి దూరం అన్నది. అవి రొయ్యల మాదిరి ఉన్నాయి వద్దు అన్నది. ఆ వెనుకే చిజ్ కోడి అంటూ వడ్డించాడు. ఇదేమిటి అంటూ చెయ్యి అడ్డం పెట్టుకుంది. చీజ్ పకోడీ కూర అమ్మ భయపడకండి అంటూ వడ్డించాడు. వాళ్ళ అక్క కోడల్ని మా అత్తగారు ఆ వంటకాలు ఎలా వండాలి అంటు భేతాళ ప్రశ్నలు వేశారు. ఆంటీ భయంలేదు
పుల్మ44X3ఖన్ అంటే తామర పువ్వులగింజల కూర, తోటకూర పోట్టు, పెసలు ఇడ్లీ వేసుకునీ ముక్కలు కోసి కూర వండుతారు. చీజ్ పకోడీ వంకాయ ముక్కలతో చేస్తారు. ఇక మామిడి కాయా వెల్లుల్లి జీడిపప్పు ముక్కలు అంతే కానీ చిట్టి రొయ్యలు కాదు అంటూ వివరించారు. అప్పుడు స్తిమితపడ్డారు. కానీ మనసు వికలం అయ్యింది. ఎదో మూడేళ్ల తరువాత బయటి ఫంక్షన్ అని వచ్చాను. ఇలాంటి వేడుకలు బాగుంటాయి కానీ భోజనం విషయంలో మంచి హాస్యం పండింది. వడ్డన కుర్రాళ్ళు చేసిన పొర పాటు వల్ల మా అత్తగారు చాలా ఇబ్బంది పడ్డారు. మేము స్టేజ్ దగ్గరకు వెళ్ళి దండలు వేయించి బహుమతి ఇచ్చి శాలువా కప్పి దీవించి వచ్చాము. మళ్ళీ మీరు పంచ సప్తశతి సహస్ర చంద్రోదయ ఫంక్షన్స్ చేసుకోవాలి. అని అత్తగారు దీవించారు. అమ్మ మీ ధీవేనల కోసమే మిమ్మల్ని పిలిచాను. భోజనం చేశారా చేశారా అంటూ తరిచి అడిగారు. ఆ ..ఆ ఎదో అంటూ అత్తగారు మాట మార్చి చెప్పారు. చక్కగా చేసుకున్నారు వేడుకలు అంటూ తప్పించుకున్నారు. పేరంటం తీసుకుని ఆటో ఎక్కి వచ్చెను. ఆతరువాత వారానికి అమే ఫోన్ చేసి ఎంతో భాద పడింది మాట తేడా వల్ల వడ్డన లోపం జరిగింది అంటూ, అబ్బా మాకు కొత్త అనుభవం మంచి హాస్యం పండినది అన్నాను. అత్తా గారికి ఎంతో భాద వచ్చి ఉంటుంది. ఒకసారి ఆమెకు ఇయ్యి అన్నది ఫోన్. నానాటి బ్రతుకు నాటకము అన్నట్లు శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సారము తెలుసుకుని  జీవిస్తే అంతా ఆనందమే. జీవితంలో కొన్ని అంశాలు ఎంతో తేలికగా చూడాలి. అప్పుడే ఆనందము. అత్తాయ్య ఫోన్ అంటూ సునంద ఇచ్చింది. పూర్ణ అందుకుని బాగున్నారా! అన్నది. సారీ అత్తయ్య భోజనం విషయంలో పేర్లు మారాయి అన్నది. అబ్బా అబ్బే ఇదో అనుభవము సుఖీభవ అన్నది. హమ్మయ్య అంతా ఎంతో ఆనందంగా హాస్యాన్ని ఆస్వాదించాం అని స్నేహితురాలు అంటే కథ రాస్తే చాలా బాగుంటుంది అన్నాము. మనసారా నవ్వు కున్నాము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!