యువతా మేలుకో
రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు
ఓ యువతా మత్తు నుంచి కోలుకో,
మన దేశ భవిత తీర్చిదిద్ద మేలుకో,
కలం పట్టి హృదిలో చైతన్యం రగిలించు,
హలం పట్టి ధరణి దున్ని అన్నదాతవుకా,
ప్రజకు వెన్నుదన్నుగా దృష్టి పెట్టరా,
తీరం చేరేందుకు గమ్యాన్ని చూపరా
ఓ యువతా మత్తు నుంచి కోలుకో,
మన దేశ భవిత తీర్చిదిద్ద మేలుకో,
నీ ఓర్పు, సహనం కోల్పోకురా,
జంకుగొంకు లేక ముందు సాగరా
శాంతి వచనాలకు ముద్దుగ హద్దు పెట్టరా,
అక్రమార్కులపై గన్ను పట్టి వేటు వేయరా
సూర్య కిరణాల వెలుగులు నింపరా,
వన్నెల వెన్నెల సోయగాలు అద్దరా
భారత పౌరుడిగా యిదే మేలుకొలుపురా
……