తానొక అయస్కాంత క్షేత్రమవ్వాలి

తానొక అయస్కాంత క్షేత్రమవ్వాలి

రచన: చంద్రకళ. దీకొండ

అక్షరాలు చదవడం నేర్పించటమే కాదు…
అక్షరాల మధ్య ఇమిడిన భావాన్ని అవగాహన చేయించాలి…!
భాషాజ్ఞానాన్ని అందివ్వడమే కాదు…
విద్యార్థులలో సామాజిక చైతన్యాన్ని కలిగించాలి…!
ప్రపంచపటాన్ని చూపడమే కాదు…
ప్రపంచశాంతి సందేశాలను వినిపించాలి…
పుస్తక జ్ఞానంతో పాటు ప్రాపంచిక జ్ఞానాన్ని అందించాలి…!
పరికరాలతో ప్రయోగాలు చూపటమే కాదు…
మూఢవిశ్వాసాలను తొలగించే హేతువాద శాస్త్రీయ విద్యను బోధించాలి…!
ప్రకృతి అందాలను నల్లబల్లపై
చిత్రించడమే కాదు…
ప్రకృతి వనరుల విలువను,పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిసేలా చేయాలి…!
ఒత్తిడులను నివారించే అభయహస్తమవ్వాలి
సమస్యలను పరిష్కరించే ఆత్మస్థైర్యాన్ని ప్రోదిచేయాలి…!
ప్రేమ వ్యవహారాల,అంతర్జాల మాధ్యమాల,చెడు వ్యసనాల సుడిగుండాలలో,
పద్మవ్యూహాలలో చిక్కనివ్వకుండా…
విద్యార్థుల సృజనాత్మకతను
తట్టిలేపే
కళా,క్రీడా విద్యలలో శిక్షణనివ్వాలి…
నైతిక,మానవతా విలువలను,జీవన నైపుణ్యాలను బోధపరచాలి…!
పాఠాలను బోధించడమే కాదు…
చెడు ఆకర్షణలనుండి దృష్టి మరల్చేలా…
తానే ఒక అయస్కాంత క్షేత్రమై…
ఉత్తమ అయస్కాంత ముక్కలుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి…!!!
******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!