మన ఇంటి జీవన జ్యోతి
తెలికిచెర్ల రాజ కృష్ణ కామేశ్వర రావు
సృష్టికి మూలం ప్రకృతి
ఆ ప్రకృతే వెలసే ప్రతి ఇంట గృహిణిగా
ఉన్నది గృహిణికి కూడా ప్రకృతికి, భూదేవికి ఉన్నంత ఓర్పు
భావించి కుటుంబ బాధ్యతలే తన కర్తవ్యంగా
తీరుస్తుంది అందరి అవుసరాలు కుటుంబానికి, మకుటం లేని మహారాణిలా
బిడ్డకు తల్లిగా, మగనికి మగువగా, అత్తకు కోడలిగా
సంసారానికి చుక్కానిలా, ఏ ఒడిదొడుకులు లేకుండా సంసార నావని ముందుకు నడిపిస్తుంది
కుటుంబ గౌరవం కాపాడుతూ
కుటుంబంలో అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటూ
వారి కళ్లలో నూతన కాంతిని ఉత్తేజింప చేస్తూ,వారి కంటికి ఆశా జ్యోతిగా మెలుగుతుంది
ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంటూ
అలుపు సోలుపు లెరుగక
తన ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి, కర్పూరంలా ఆహుతి అవుతూ
దీప కాంతిని ప్రసరిస్తూ మనుగడ సాగించే ఆదర్శ మహిళ
ఆలిగా, తల్లిగా, చెల్లిగా, గురువుగా, అందరినీ ప్రేమగా చూసుకొనే ప్రేమ మూర్తి
ఒకరి మెప్పు ఆశించకుండా, అహర్నిశలు కుటుంబం కోసమే కష్ట పడే కష్ట జీవి
అందరి ఆశలు నెరవేర్చే ఆశా జ్యోతి
అందరి ఆనందాన్ని కోరుకొనే ఆనంద జ్యోతి
వెరసి అందరికి జీవన జ్యోతి
ఓ మహిళా! ఓ ఆశా జ్యోతి! ఓ జీవన జ్యోతీ!
అందుకో ఇవే మా వందనాలు!