బాల్యము

బాల్యము.
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల.

రాము బుక్స్ ముందర పెట్టుకొని ఏడుస్తున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కవిత? రామును చూసింది. ‘రాము ఎందుకోసం ఏడుస్తున్నాడు. కారణం ఏంటి? తెలుసుకోవాలి’ అనుకుంటూ “ఏంటి రాము ఎందుకు ఏడుస్తున్నావ్? అంటూ దగ్గరగా వెళ్లి అడిగింది.” కారణం చెప్పలేదు ఏడుస్తున్నాడు. కాళ్లు మలచుకొని మొహం చేతులు మోకాళ్లపై పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.
‘ఇంతలా ఎందుకు ఏడుస్తున్నాడు? కాస్త భయం వేసింది కవితకు!’ “ఎందుకు ఏడుస్తున్నావ్? నా బుజ్జి కన్నా నాకు చెప్పవా? అని అడిగింది కవిత. తల ఎత్తలేదు. అలాగే ఉన్నాడు చెప్పు నాన్న! నేనున్నానుగా? నీకేంటి? భయం చెప్పు, బుజ్జి కన్నా! అంటూ భుజ్జగిస్తూ దగ్గరగా కూర్చుని అడిగింది. “రాము చదువుతున్నావా! లేదా అంటూ గట్టిగా అరుస్తూ హోమ్ వర్క్ చేసి చదువుకోమంటుంటే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు 24 గంటలు సెల్ ఫోన్ తో ఆడితే చదువు ఎలా వస్తుంది?. రేపు ఎగ్జామ్స్ ఏం రాస్తావ్? వద్దని లాక్కుంటే ఏడుస్తూ కూర్చుంటావా! అరుస్తూ వచ్చింది ప్రత్యూష.” “ఏంటి వదిన రాము ఎందుకు ఏడుస్తున్నాడు? అంటూ కవిత అడిగింది.
ఇంకేముంటుంది నీ అల్లుడికి చదవమంటే సెల్ పట్టుకొని ఆడుతున్నాడు”. హుష్ అంతేనా! “ఏంటి కవిత అలా అంటావ్? చదవమంటే ఎంతగా మొండితనం చేస్తున్నాడో చూస్తున్నావా? ఇంక అంతేనంటావా? మరి లేకుంటే ఏంటి వదిన?  నువ్వు పిల్లాడిని మరీ గారాబం చేస్తున్నావు కవిత.”అలా కాదు వదిన మనం చెప్పేదాన్ని బట్టి  ఉంటుంది. నువ్వు ఎందుకు కంగారు పడతావు!? నేను చెప్తానుగా, నువ్వు ముందు కూల్ గా ఉండు” “తల్లి రాగానే అత్తను గట్టిగా వాటేసుకున్నాడు.
“ఏంటి నాన్న ఎందుకు అల్లరి చేస్తున్నావ్” ‘ నేనేం చేయడం లేదు అమ్మే అబద్ధం చెప్తుంది. “అత్త ఉందనే ధైర్యంతో’ గోముగా చెప్పాడు రాము”. అమ్మను అలా అనవచ్చునా మమ్మీకి ముందు సారీ చెప్పు. సారీ మమ్మీ అన్నాడు. కోపంగా తప్పదన్నట్టుగా నేల చూపులు చూస్తూ చెప్పాడు రాము. నువ్వు రా కవిత! ఇప్పుడే కాలేజ్ నుండి వచ్చావు ఫ్రెష్ అయి రా! కవిత టీ పెట్టుకుని వస్తాను. సరే వదిన రాము ఇప్పుడే వస్తాను. అల్లరి చేయకుండా బుద్దిగా కూర్చో సరేనా! సరే అత్త  ఫ్రెష్ అయి వచ్చి రాము దగ్గర కూర్చుంది. “రాము ఎప్పుడు సెల్ పట్టుకుంటే ఎలా? తప్పు కదా!? సెల్ పట్టుకొని కూర్చుంటే నీకు చదువు ఎలా వస్తుంది? చెప్పు నిన్ను బ్యాడ్ బాయ్ అంటారు.. నీకు ఓకేనా? “కాదు”మరి చదవాలి కదా ? నువ్వు గుడ్ బాయ్ వా? బ్యాడ్ బాయ్ వా చెప్పు? నేను గుడ్ బాయ్ ని అయితే ఇంకోసారి సెల్ పట్టుకోవద్దు సెల్ తో ఆడేవాళ్లంతా బాడ్ బాయ్స్ తెలుసా! “తెలియదు అత్త.” “సెల్ఫోన్ ఎక్కువగా వాడితే కళ్ళు చెడిపోతాయి. చెవులు వినబడవు మనిషి లో యాక్టినేస్ పోతుంది.” మనం ఏపని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. మనకు అదే ప్రపంచం తప్ప వేరే ప్రపంచం ఉండదు. కొందరి కొందరికి పిచ్చి కూడా లేస్తుంది. సెల్ ఫోన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో! అంత ప్రమాదం కూడా ఉంది. మన అవసరాన్ని బట్టి మనం సెల్ ఫోను వాడాలి.
“ఉంది కదా అని మనం ఎప్పుడు దాన్ని ఉపయోగిస్తే ఎన్ని అనర్ధాలు వస్తాయి తెలుసా రాము? అవునా అత్త…ఇంకోసారి నేను వాడను నువ్వు చెప్పినట్టు అమ్మ చెప్పినట్టే వింటాను”. ఇంకోసారి కోపం తెచ్చుకోవుగా! తెచ్చుకోను? “నేను గుడ్ బాయ్! ‘ఓ వెరీ గుడ్. మీ క్లాసులో రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు. “వెరీ గుడ్ అంటూ క్లాప్స్ కొడతారు అత్త! ఇప్పుడు నువ్వు కూడా వెరీ గుడ్ బాయ్ క్లాప్స్ అనగానే ఇద్దరు సంతోషంగా రెండు చేతులతో క్లాప్స్ కొట్టారు. మరి నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు రాము? అవసరాన్ని బట్టే ఏ వస్తువైనాన అలా వాడుకోవాలి. కవిత అంటూ ప్రత్యూష వచ్చింది. ఏంటి వదిన భోజనం వడ్డిస్తాను రండి చాలా పొద్దుపోయింది. మమ్మీ ..మమ్మీ నేను గుడ్ బాయ్ ని తెలుసా? అవునా కన్నా కంగ్రాట్స్ నువ్వు ఎప్పుడూ గుడ్ బాయ్ అంటూ లోనికి వెళ్లారు. “పిల్లలు ఎప్పుడైనా అదే కావాలని మారం చేసినప్పుడు. చిన్నప్పటినుండే వద్దని చెప్తూ దాని గురించి వివరణగా చెప్తూ మందలిస్తూ అర్థమయ్యేలా చెప్తుండాలి.”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!