మృదురాగం

అంశం: అందమైన అబద్ధం

మృదురాగం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: మక్కువ. అరుణకుమారి

అందగాడు కాకున్నా
చందమామ నీవంటూ
అమ్మచేత పొగడ్తలు
అందమైన అబద్ధం

ఆకతాయి వెధవైనా
బంగారం నేనంటూ
నాన్న నోట పలికే
అందమైన అబద్ధం

పని పాటలు రాకున్నా,
వంట వార్పు చేయకున్నా,
చదువు సంధ్య వంటపట్టకున్నా
మా అమ్మాయి సకల సద్గుణరాశి
అన్ని కళల ఆరితేరిన ప్రవీణ అంటూ
తల్లి దండ్రుల నోట పలుకు
అందమైన అబద్ధం

బద్ధంకాని ఈ అబద్ధాలు అందమైనవే
ఆనందం కల్గించినందుకే కాదు
అపకారం చేయనందుకు

నా రాణివి నీవంటూ
నీ రాజును నేనంటూ
రాణివాసం మనదంటూ
మత్తుజల్లి,మాయచేసి
యదనుగిల్లి, మదిని దోచి
బతుకునావ నడిసంద్రంలో
ముంచివేయు మాయావుల నోట పలుకు

అందమైన అబద్ధాలు
బతుకుకు అభద్రతలు
అంతులేని వేదనలు
ఆత్మీయతకు ఛిద్రాలు

అందమైన అబద్ధం
హృద్యంగా ఉండాలి
యద వీణియలు మీటాలి
సరిగమలను పలకాలి
మృదురాగం సాగాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!