తొలి మోజు

అంశం: అందమైన అబద్ధం

తొలి మోజు 
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: యాంబాకం

నీవే నా ప్రాణం
నీవే నా జీవితం
నీతోనే నా స్నేహం
నీ కోసం నా కలవరం

నిను చూసిన ఆక్షణం
నాలో మెదిలెను భావం
నీ తోడు నాకు అంబరం
నీ రూపే నాకు స్వప్నం

నీ పోందుకై కలవరం
నీ ఆనందం నాకు ఇష్టం
నీవు రాకుంటే ఆరాటం
నీవు కనిపించిన ఆక్షణం

నా గుండెలో తెలియని బారం
నీ నీలి కరులు ఒక సంద్రం
నీ జడపూలు ఒక మైకం
నీ ప్రేమ నాకు శాశ్వతం

నా మనసుకు వేయాలి కళ్ళెం
లేకుంటే కావాలి నీపరువం
మన పండంటి కాపురం
సాగాలి సుదీర్ఘ కాలం

మనం కలిస్తే రాలును వర్షం
నిను చూడలేని ఆనిముషం
నీవే నాకు ఇరకాటం‌
నీ పరిచయ‌ం ఒక బూటకం

కాలం కలసి వస్తే
మనకు జరిగెను శోభనం
మనం తొందర పడితే
కలిగేను శుభం

నీ పరిచయం నాటకం
నా కోరిక నీతో జీవించటం
ఎపుట్టల్లోనా అధ్యయనం
మనం కలసి రాయాలి పెళ్ళి పుస్తకం..

నీకు ఉన్నదే అందం
నాకు లేనిదే భయం
మన జంట ఒక
అందమైన అబద్ధం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!