ఎందుకు ఆ కోపం

ఎందుకు ఆ కోపం

రచన: కార్తిక్ నేతి

రేపటి రోజు ఉంటుందో లేదో తెలిదు ,
ఎందుకు ఈ అపార్ధాలు ,
విచేక్షణను కోల్పోయేలా చేసే కోపాలు,
నియంత్రించుకనే ప్రయత్నం చేయకపోతే ,
పగుళ్ళు పడతాయి బంధాలు,
అడుగంటి పోతాయి నవ్వులు,
చితికి పోతాయి ఆశలు,
కన్నీటి పొంగులో కొట్టుకుపోతాయి కలలు,
మొదలవుతాయి భరించరాని నిశబ్దాలు,
ఆ ని నిశ్శబ్ధాలే ఇద్దరి మద్యన దూరానికి మొదలు,
గతాన్ని త్రోవ్వుకుంటూ ,
వృధా చేయకు చేతిలో ఉన్న బంగారు క్షణాలను,
శాంతి మంత్రం ఆవేశాన్ని దరికి రాకుండా కాపాడే దైవం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!