అమ్మ

అమ్మ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీమతి మంజీత కుమార్

మేము అమ్మలం
తుది శ్వాస వరకూ
అమ్మను మరవని మనస్కులం
అమ్మ జ్ఞాపకాల పడవలో
సంసార సంద్రాన్ని ఈదుతున్న మహిళలం
ఆకర్శించే ముగ్గులు వేసినా
వంట రుచిగా చేసినా
వీనుల విందుగా పాట పాడినా
అన్నీ అమ్మ చలవేగా
కన్నీటిని పంటి బిగువున దాచిపెట్టడం
బాధను గుండెల్లో అణచివేయడం
నొప్పిని నవ్వుతో కప్పిపుచ్చడం
అన్నీ అమ్మను చూసి నేర్చుకున్నవేగా
పిల్లల కడుపు నింపి పస్తులుండడం
తాగొచ్చి కొట్టినా నాన్నను మన్నించడం
అత్తారింటి ఆరళ్లు మౌనంగా భరించడం
అన్నీ అమ్మ చెప్పని జీవిత పాఠాలేగా
అమ్మ … రెండక్షరాల జీవన వేదం
అమ్మ … గుండెల్లో కొలువైన దైవం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!