నిలువలు చేయకు

నిలువలు చేయకు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎన్.రాజేష్

కొలువు చేసో, కష్టాలు పడో సంపాదించినదంతా అనుభవించుటే అసలైన గుణం,
కలుగును సంతోషం,
హృదయానికి ఆనందం!
లేనిచో.. నిలువ చేసినదంతా
దొంగలపాలో, దొరల పాలో, దాయదుల పాలో అవుతుంది.. అప్పుడు కలుగును విచారం,
మిగులుతుంది దుఃఖము!
అవసరానికి మించినదంతా
నిలువలు చేస్తూ పోతుంటే
పనికిరానిది అవుతుంది,
బాధను వేదనను పంచుతుంది!
వలువల నిలువలైనా వస్తువుల నిలువలైనా
శిలలైనా శిఖరాలైనా
వనాలైనా జనాలైనా
వలయాల మాటుననో ప్రళయాళ వేటులోనో లయమై పోతవి కదా.
పాడై పోవును కదా.!
ఏ నిలువలైనా నీటి మూటలే
మన పాలిట ముండ్ల బాటలే
అందుకే నిలువలు చేయొద్దు
నిక్షేపాలను దాయొద్దు!
అందుకే, నిలువలు దాయకు
సంపాదించింది అంతా..
బుగ్గి అయినదని
బాధ పడకు.!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!